Tollywood: పెళ్లి రోజే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. శుభాకాంక్షల వెల్లువ
ప్రముఖ హీరోయిన్ శుభవార్త చెప్పింది. తాను తల్లిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం ఇద్దరమూ ఆరోగ్యకరంగానే ఉన్నట్లు తన పోస్టులో పేర్కొంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

పిల్ల జమీందార్ సినిమా ఫేమ్, ప్రముఖ కన్నడ హీరోయిన్ హరిప్రియ అమ్మగా ప్రమోషన్ పొందింది. ఆదివారం (జనవరి 26) ఆమె పండంటి మగ బిడ్డను ప్రసవించింది. ఈ సంతోషకరమైన వార్తను హరిప్రియ భర్త, ప్రముఖ నటుడు వశిష్ట సింహ సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నాడు. ‘బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో హరిప్రియ మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారు. ఇక మా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది’ అంటూ ఎమోషనల్ అయ్యాడు వశిష్ట సింహా. దీతో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన హరిప్రియ- వశిష్ట దంపతులకు కుటుంబ సభ్యులు, బంధువులు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక్కడ విశేషమేమిటంటే.. హరిప్రియ, వశిష్ఠ సింహా పెళ్లి రోజునే వారు అమ్మానాన్నలయ్యారు. ఈ జంట 2023 జనవరి 26న వివాహం చేసుకున్నారు. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత, అంటే జనవరి 26, 2025న పండంటి మగ బిడ్డ వారి జీవితంలోకి అడుగు పెట్టాడు. ‘దీంతో మా పెళ్లి రోజునే వచ్చాడు’ అని వశిష్ఠ సింహ పోస్ట్ చేశాడు.
హరిప్రియ, వశిష్ఠ సింహ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉంటున్నారు. అయితే పెళ్లి తర్వాత హరిప్రియ తన కుటుంబానికి ఎక్కువ సమయం ఇచ్చింది. గర్భం ధరించగానే సినిమా షూటింగులకు దూరం అయ్యింది. హరిప్రియ కన్నడలోనే కాకుండా ఇతర భాషల్లోనూ ఫేమస్. ముఖ్యంగా తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిందీ అందాల తార. నాని పిల్ల జమీందార్ తో పాటు వరుణ్ సందేశ్‌తో కలిసి అబ్బాయి క్లాస్- అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది హరిప్రియ. అలాగే బాలకృష్ణతో కలిసి జై సింహా సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే దీని తర్వాత తెలుగు వెండి తెరపై కనిపించలేదీ అందాల తార.
హరిప్రియ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
ఇక హరిప్రియ భర్త కూడా ప్రముఖ నటుడే. కేజీఎఫ్ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించిన వశిష్ట నారప్ప, నయీం డైరీస్, ఓదెల రైల్వేస్టేషన్, ఏవమ్ తదితర తెలుగు సినిమాల్లో నటించాడు.
సీమంతం వేడుకలో భర్తతో హరిప్రియ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.