Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Durgha Tej: మామకు తగ్గ అల్లుడు.. తన కోసం వచ్చిన అభిమానుల కోసం సాయి దుర్గ తేజ్ ఏం చేశాడో తెలుసా? వీడియో

సామాజిక సేవా కార్యక్రమాలు, ధాన ధర్మాల విషయంలో తన మేనమామలనే ఫాలో అవుతున్నాడీ సాయి దుర్గ తేజ్. అలా తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడీ సుప్రీం హీరో. తనను చూసేందుకు షూటింగ్ సెట్ దగ్గరకు వచ్చిన అభిమానుల కోసం ఏకంగా..

Sai Durgha Tej: మామకు తగ్గ అల్లుడు.. తన కోసం వచ్చిన అభిమానుల కోసం సాయి దుర్గ తేజ్ ఏం చేశాడో తెలుసా? వీడియో
Sai Durga Tej
Follow us
Basha Shek

|

Updated on: Jan 27, 2025 | 6:35 AM

రోడ్డు ప్రమాదం తర్వాత సినిమాలు బాగా తగ్గించేశాడు మెగా హీరో సాయి దుర్గ తేజ్‌. ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటున్నాడు. ఏది పడితే అది చేయకుండా చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. యాక్సిడెంట్ తర్వాత విరూపాక్షతో వంద కోట్ల క్లబ్ లో చేరిన సుప్రీం హీరో ఆ వెంటనే బ్రో చిత్రంలో నటించాడు. ఇందులో తన మేనమామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడీ సుప్రీం హీరో. దీని తర్వాత సుమారు ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ అంటూ ఓ డిఫరెంట్ మూవీతో మన మందుకు రాబోతున్నాడు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తుంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం సంబరాల ఏటిగట్టుకు సంబంధించిన మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

కాగా సాయి ధరమ్ తేజ్ ను చూసేందుకు షూటింగ్ సెట్‌ లో ఇటీవల అభిమానులు భారీగా తరలివచ్చారట. దీంతో తన దగ్గరికి వచ్చిన వారిని అలాగే పంపించకుండా మెగా మేనల్లుడు ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా భోజనాలను ఏర్పాటు చేయించాడట. వారి కడుపు నింపి సెల్ఫీలు, ఫొటోలు దిగాడట. వచ్చిన ఫ్యాన్స్‌ను ఉద్దేశించి మాట్లాడిన సాయి దుర్గ తేజ్ అందరినీ భోజనాలు ఎలా ఉన్నాయ్ అని అడిగాడు. అలాగే జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో మెగాభిమానులు, నెటిజన్లు సాయి దుర్గ తేజ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మామకు తగ్గ అల్లుడు అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సంబరాల ఏటి గట్టు మూవీ సెట్ లో భోజనాలు చేస్తున్న మెగాభిమానులు..

సంబరాల ఏటి గట్టు సినిమా కోసం బాడీని బాగానే పెంచేశాడు సాయి ధరమ్ తేజ్. గతంలో మునుపెన్నడూ చూడని లుక్కులో మెగా హీరో కనిపించనున్నాడు.  ఈ మూవీతో పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు.

అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతున్న సాయి దుర్గ తేజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.