Tiger Prabhakar: 17 ఏళ్ల హీరోయిన్‌తో పెళ్లి.. కట్ చేస్తే ఎన్నో ఘటనలు.. టైగర్ ప్రభాకర్ నిజ జీవితంలోనూ విలనేనా..?
తన కంటే 31 ఏళ్లు పెద్దవాడైన ప్రభాకర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వివాహం జరిగిన సంవత్సరానికే భర్త వదిలి వెళ్లిపోయింది అంజు. అందుకు గల కారణాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
టైగర్ ప్రభాకర్.. అలియాస్ కన్నడ ప్రభాకర్.. ఈ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు ఠక్కున గుర్చొచ్చే సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి. మెగాస్టార్ చిరంజీవి.. శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రంలో టైగర్ ప్రభాకర్ ప్రతినాయకుడిగా కనిపించాడు. 80’s నుంచి 90’sలో దక్షిణాదిలో ఎన్నో హిట్ చిత్రాల్లో విలన్ పాత్రలలో నటించి మెప్పించాడు. దాదాపు 450 సినిమాల్లో నటించిన ఆయన 2001 మార్చి 25న కన్నుమూశారు. అయితే ఇటీవల అతని మూడో భార్య అంజు షాకింగ్ కామెంట్స్ చేశారు. తన కంటే 31 ఏళ్లు పెద్దవాడైన ప్రభాకర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వివాహం జరిగిన సంవత్సరానికే భర్త వదిలి వెళ్లిపోయింది అంజు. అందుకు గల కారణాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
చెన్నైకి చెందిన అంజు బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. కానీ 17 ఏళ్ల వయసులో వేసిన ఓ తప్పటడుగు ఆమె జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. ప్రేమ, పెళ్లి జీవితాన్ని ప్రశ్నార్థకం చేశాయి. ఆమె 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 48 ఏళ్ల టైగర్ ప్రభాకర్ ను ఇంట్లో వాళ్లను కాదని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు అర్జున్ ఉన్నారు. కానీ వీరిద్దరి కేవలం సంవత్సరం మాత్రమే కలిసి ఉన్నారు. అంజు మాట్లాడుతూ.. ” ఉదిరిపూక్కల్ సినిమాతో బాలనటిగా అడుగుపెట్టాను. నేను సినిమా ఇండస్ట్రీలోకి రావాలని నా తల్లిదండ్రులు కోరుకోలేదు. కానీ అప్పుడు నాకు అవకాశాలు ఎక్కువగా రావడంతో ఇండస్ట్రీలో కొనసాగాను. బాలనటిగా.. కథానాయికగా దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించాను. ఎన్నో చిత్రాల్లో నటించిన నేను కన్నడలో రేంజర్ అనే సినిమాలో అవకాశం వచ్చింది. మొదటి సినిమాతోనే నాకు ప్రభాకర్ పరిచయమయ్యారు. అప్పుడు నా వయసు 17 ఏళ్లు. అతను నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు.
నేను మా తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో ప్రభాకర్ కోసం ఇల్లు వదిలి వెళ్లిపోయాను. తనను చాలా నమ్మాను. తనతో కలిసి ఏడాది ఉన్నాను. కానీ తనకు అప్పటికే రెండు పెళ్లిల్లు అయిపోయి పిల్లలు ఉన్నారని తెలిసిందే. అప్పటికే నేను ప్రెగ్నెంట్. తన గురించి తెలిసి ప్రశ్నించినందుకు నేను చెడ్డదాన్ని అయిపోయాను. తప్పుడు నిర్ణయం తీసుకుని చాలా కుంగిపోయాను. అతడితో ఉండడం ఇష్టం లేక బయటకు వచ్చేశాను. నా దగ్గరున్న బంగారం కూడా తన దగ్గరే వదిలి వచ్చేశాను. ఆ సమయంలో ప్రభాకర్ తో ఓ మాట చెప్పాను. నన్ను చాలా బ్యాడ్ చేశావు. నువ్వు చచ్చినా నీ ముఖం చూడను అని చెప్పాను. తను చనిపోయినా వెళ్లలేదు” అంటూ చెప్పుకొచ్చారు అంజు.