Ajith Kumar: అజిత్ భార్య హీరోయిన్ మాత్రమే కాదు సింగర్ కూడా.. సాంగ్ వింటే కాళ్లు కదపాల్సిందే..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Mar 28, 2023 | 9:46 AM

ఇప్పటికీ సొంతంగా ఫోన్ వాడకుండా.. అటు సోషల్ మీడియాతోనూ సంబంధం లేకుండా ఉంటాడు ఈ హీరో. షూటింగ్స్ నుంచి కాస్త బ్రేక్ దొరికితే చాలు ప్రపంచాన్ని చూట్టేయడానికి బైక్ పై బయలుదేరతాడు. ఆయనకు సంబంధించిన ఫోటోస్ చాలా తక్కువగా నెట్టింట వైరలవుతుంటాయి. ఇక అజిత్‏తో ఆయన ఫ్యామిలీకి కూడా సోషల్ మీడియా ప్రపంచానికి చాలా దూరం.

Ajith Kumar: అజిత్ భార్య హీరోయిన్ మాత్రమే కాదు సింగర్ కూడా.. సాంగ్ వింటే కాళ్లు కదపాల్సిందే..
Shalini Ajith Kumar
Follow us

తమిళ్ స్టార్ హీరో అజిత్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. దక్షిణాదిలోనే మోస్ట్ ఫాపులర్ హీరోలలో అజిత్ ఒకరు. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ హీరో అంటే పడిచచ్చే అభిమానులు ఉన్నారు. ఇటీవలే తెగింపు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు ఈ హ్యాండ్సమ్ హీరో. కానీ హీరోలలో అజిత్ శైలీ మాత్రం ప్రత్యేకం. ఇప్పటికీ సొంతంగా ఫోన్ వాడకుండా.. అటు సోషల్ మీడియాతోనూ సంబంధం లేకుండా ఉంటాడు ఈ హీరో. షూటింగ్స్ నుంచి కాస్త బ్రేక్ దొరికితే చాలు ప్రపంచాన్ని చూట్టేయడానికి బైక్ పై బయలుదేరతాడు. ఆయనకు సంబంధించిన ఫోటోస్ చాలా తక్కువగా నెట్టింట వైరలవుతుంటాయి. ఇక అజిత్‏తో ఆయన ఫ్యామిలీకి కూడా సోషల్ మీడియా ప్రపంచానికి చాలా దూరం.

ముఖ్యంగా ఆయన సతీమణి.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ షాలిని కూడా ఇంటర్నెట్ కు దూరంగా ఉంటారు. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటివరకు వరుస చిత్రాలతో బిజీ హీరోయిన్‎గా ఉన్న షాలిని.. పెళ్లి తర్వాత మాత్రం సినిమాలకు దూరంగా ఉండిపోయారు. కుటుంబానికి పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు షాలిని. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. తాజాగా అజిత్ సతీమణి షాలినికి సంబంధించిన ఓ త్రోబ్యాక్ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇప్పటి వరకు హీరోయిన్‏గా తెలిసిన షాలిని.. సింగర్ అని తెలిసి షాకవుతున్నారు ఫ్యాన్స్.

ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న వీడియోలో షాలిని.. స్టేజ్ పై ఎంతో అందగా పాట పాడుతుంది. మలయాళం గాయకుడు ఎంజీ శ్రీకుమార్ తో కలిసి మేఘం సినిమాలోని మార్గఝియే మల్లికాయే పాటను షాలిని అద్భుతంగా ఆలపించారు. వీరిద్దరి వెనకే మోహన్ లాల్, మమ్ముట్టి బ్యానర్ కనిపిస్తోంది. అయితే ఈ ఫుటేజీ ఏ ప్రోగ్రామ్ కు చెందినదో స్పష్టంగా తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి

షాలిని వాయిస్.. ఆమె పాడే విధానం వింటే ఎవరైనా కాలు కదపాల్సిందే. అందుకే షాలిని సాంగ్ వీడియోపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. హీరోయిన్ గానే కాదు.. సింగర్ గానూ ఆమె సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరు చేసేయ్యండి.

View this post on Instagram

A post shared by Nisha (@i_nisha_isha)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu