AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సుధీర్ వర్మ ఆత్మహత్య కేసులో మిస్టరీ ట్విస్ట్.. మూడురోజుల క్రితమే విషం తాగిన నటుడు.. అప్పులే కారణం అని..

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటుడు సుధీర్ వర్మ విశాఖలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్త అతని స్నేహితులు, సన్నిహితుల్ని షాక్‌కి గురిచేసింది.

Tollywood: సుధీర్ వర్మ ఆత్మహత్య కేసులో మిస్టరీ ట్విస్ట్.. మూడురోజుల క్రితమే విషం తాగిన నటుడు.. అప్పులే కారణం అని..
Sudheer Varma
Surya Kala
|

Updated on: Jan 24, 2023 | 9:00 AM

Share

టాలీవుడ్ యువనటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య కేసులో మిస్టరీ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పాయిజన్ తీసుకుని చనిపోయినట్టు విశాఖ డాక్టర్ల పోస్ట్‌మార్టం రిపోర్ట్ చెప్తోంది. ఇంతకీ పాయిజన్ తీసుకుని చనిపోయేంత కారణాలు ఏమున్నాయి? అసలు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. గత కొంతకాలంగా టాలీవుడ్ లో వరస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వృద్యాప్యపు సమస్యలతో కొందరు, ఆత్మహత్య, యాక్సిడెంట్స్ ఇలా రకరకాల కారణంతో నటీనటులు మృతి చెందుతూనే ఉన్నారు. తాజాగా మళ్లీ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటుడు సుధీర్ వర్మ విశాఖలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్త అతని స్నేహితులు, సన్నిహితుల్ని షాక్‌కి గురిచేసింది.

సుధీర్ వర్మ ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. కుందనపు బొమ్మ చిత్రంలో ఓ హీరోగా నటించాడు. సెకండ్ హ్యాండ్, షూట్ అవుట్ ఎట్ ఆలేరు చిత్రాల్లోనూ సుధీర్ ఆకట్టుకున్నాడు. అంతాబాగానే ఉందనుకున్న టైమ్‌లో సూసైడ్ అటెంప్ట్ చేయడం అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. మూడు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సుధీర్ చనిపోయాడు. అయితే పాయిజన్ తీసుకున్న కారణంగానే చనిపోయాడని విశాఖలోని ప్రైవేట్ హాస్పిటల్‌ డెత్ రిపోర్ట్ చెబుతోంది. విషం తీసుకోవడంతో కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయాడని డాక్టర్లు నిర్దారించారు.

సుధీర్ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉండొచ్చని కుటుంబసభ్యులు, స్నేహితులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో సుధీర్‌కు సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్‌ అంశాలను కుటుంబసభ్యుల్ని అడిగి తెలుసుకుంటున్నారు పోలీసులు. ఫైనాన్సియల్ సమస్యలన్న ఆరోపణలతో.. అప్పులు ఇచ్చిన వాళ్ల వివరాలు సేకరిస్తున్నారు. అలాగే వాళ్లు ఎంతకాలంగా సుధీర్‌ను వేధిస్తున్నారు..? ఎంత పెద్ద మొత్తంలో బాకీ ఉన్నాడనే అంశాలపై పోలీసులు లోతుగా ఆరాతీస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..