Telugu News Entertainment Tollywood Tollywood Actor Naveen Chandra to become father soon shares wife baby bump pics on Valentine's Day Telugu Cinema News
Naveen Chandra: ప్రేమికుల రోజు శుభవార్త చెప్పిన టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్.. త్వరలోనే తండ్రికానున్న నవీన్ చంద్ర
ఈ సందర్భంగా తన సతీమణి బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసుకున్న నవీన్ చంద్ర.. 'బేబీ మూన్.. నా చేతుల్లోకి నిన్ను ఎప్పుడెప్పుడు తీసుకుని ముద్దాడుతానా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.
ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ వర్సటైల్ నటుడు నవీన్ చంద్ర తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే తాను తండ్రిగా ప్రమోషన్ పొందనున్నట్లు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా తన సతీమణి బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసుకున్న నవీన్ చంద్ర.. ‘బేబీ మూన్.. నా చేతుల్లోకి నిన్ను ఎప్పుడెప్పుడు తీసుకుని ముద్దాడుతానా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందుతున్నందుకు చాలా గొప్పగా ఉంది. కొత్త జీవితం, కొత్త ప్రయాణం’ అంటూ మురిసిపోయాడు. ప్రస్తుతం నవీన్ చంద్ర పోస్టు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మధుశాలిని, ఆకాంక్షసింగ్, రెజా తదితర సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నవీన్ దంపతులకు ముందస్తు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.
BABY MOON ? ❤️
Can’t wait to hold you in our Arm’s.
Advancing towards parenthood excited!!!
New phase , New life , New journey !!!
Father to be !!!! Orma❤️
Welcome to 2023 !
. pic.twitter.com/VdSefyDOX9
కాగా కర్ణాటకలోని బళ్లారికి చెందిన నవీన్ చంద్ర ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. మొదటి సినిమాతోనే అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఆతర్వాత దళం, త్రిపుర, భమ్ భోలెనాథ్, త్రిపుర, లక్ష్మీదేవికి ఓ లక్కుంది, భానుమతి రామకృష్ణ తదితర సినిమాల్లో హీరోగా నటించాడు. ఆ తర్వాత నేను లోకల్, అరవింద సమేత, ఎవరు, మోసగాళ్లు, గని, విరాటపర్వం, రంగరంగ వైభవంగా , అమ్ము, రిపీట్ తదితర సినిమాల్లో విలన్‌గా, సపోర్టింగ్ రోల్స్‌తో నటించి మెప్పించాడు. సినిమాల సంగతి పక్కన పెడితే నవీన్ చంద్ర పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఈక్రమంలో తన సతీమణి ఒర్మ ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.