Nandamuri Taraka Ratna: మరో మూడురోజుల్లో పుట్టిన రోజు.. ఇంతలోనే మృత్యుకౌగిలిలోకి..
‘యువగళం’ పాదయాత్రలో నందమూరి వారసుడు, సినీ నటుడు తారకరత్న కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. పాదయాత్రలో భాగంగా లోకేష్ తో కలిసి నడుస్తుండగా.. తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

నందమూరి కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. తీవ్ర గుండెపోటుతో తారకరత్న కన్నుమూశారు.23 మూడు రోజులు మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు విడిచారు తారకరత్న. నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో నందమూరి వారసుడు, సినీ నటుడు తారకరత్న కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. పాదయాత్రలో భాగంగా లోకేష్ తో కలిసి నడుస్తుండగా.. తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదాయలకు తరలించి, 23 రోజులుగా మెరుగైన వైద్యం అందించారు అయినా కూడా తారకరత్నను కాపాడుకోలేకపోయారు.
ఇదిలా ఉంటే మరో మూడు రోజుల్లో తారకరత్న పుట్టిన రోజు.. ఫిబ్రవరి 22న తారకరత్న 40వ పడిలోకి అడుగు పెట్టేవారు. కానీ ఇంతలోనే ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఇది నందమూరి అభిమానుల గుండెలను మరింత మెలిపెడుతోంది.
గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. తారక రత్న మృతదేహాన్ని బెంగులూరు నుంచి హైదరాబాద్ మోకిల లోని తన నివాసానికి తరలించారు. మోకిల లోని ది కంట్రీ సైడ్ విల్లా కు చేరుకున్న తారక రత్న మృతదేహం. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.




