Master Bharath: షాకింగ్.. మాస్టర్ భరత్ తల్లి హఠాన్మరణం.. ఏమైందంటే?
టాలీవుడ్ లో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గతంలో ఎన్నో సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించి ప్రస్తుతం నటుడిగా కొనసాగుతోన్న మాస్టర్ భరత్ తల్లి అకాల మరణం చెందారు. ఆదివారం (మే18) రాత్రి ఆమె చెన్నైలో తుది శ్వాస విడిచారు. దీంతో భరత్ తో పాటు అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

టాలీవుడ్ ప్రముఖ నటుడు మాస్టర్ భరత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతని మాతృమూర్తి కమలాసిని హఠాన్మరణం చెందారు. ఆదివారం (మే1) రాత్రి చెన్నైలో ఆమె కన్నుమూశారు. దీంతో నటుడు భరత్ తో పాటు అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు భరత్ కు ఫోన్ చేసి ధైర్యం చెబుతున్నారు. కమలాసిని గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఆమె గుండెపోటతో తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బంధువులు, కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు చెన్నైలోని భరత్ ఇంటికెళ్లి కమలాసిని భౌతిక కాయాన్ని సందర్శిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. కాగా భరత్ తల్లి ఆకస్మిక మరణం అటు టాలీవుడ్ లోనూ, ఇటు కోలీవుడ్ లోనూ తీవ్ర విషాదం నింపింది. పలువురు సినీ ప్రముఖులు, సహ నటులు సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం తెలియజేస్తూ, భరత్ కుటుంబానికి అండగా నిలుస్తామంటున్నారు.
కాగా ఛైల్డ్ ఆర్టిస్టుగా సుమారు 80కు పైగా సినిమాల్లో నటించాడు భరత్. రెడీ, వెంకీ, ఢీ, కింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, పెదబాబు, ఆనందమానందమాయే, గుడుంబా శంకర్, హ్యాపీ, పోకిరి, అందాల రాముడి.. దుబాయ్ శీను ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో తనదైన కామెడీ తో తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. అయితే మధ్యలో చదువు కారణంగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. చిన్నప్పుడు చాలా బొద్దుగా కనిపించిన భరత్ పెద్దయ్యాక మాత్రం ఫిట్ బాడీతో హీరోలా రెడీ అయ్యాడు. ఈ క్రమంలోనే అల్లు శిరీష్ నటించిన ఏబీసీడీ సినిమాలో సెకెండ్ హీరోగా ఆకట్టుకున్నాడు.ఆ తర్వాత ఇద్దరి లోకం ఒకటే, ఆచారి ఆమెరికా యాత్ర తదితర సినిమాల్లోనూ కీ రోల్స్ పోషించాడు. చివరగా గోపీచంద్ హీరోగా నటించిన విశ్వం సినిమాలో కనిపించాడు భరత్. ప్రస్తుతం తనే సోలో హీరోగా ఓ సినిమా చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది.
తల్లితో మాస్టర్ భరత్..

Master Bharath Mother
ఓవైపు సినిమాల్లో నటిస్తూనే తన మెడిసిన్ ను కూడా భరత్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడీ నటుడు. ఇదే సందర్భంగా తల్లితో తనకున్న అనుబంధాన్ని అందరితో పంచుకున్నాడు. అయితే ఇది జరిగిన కొద్ది రోజులకే భరత్ తల్లి కన్నుమూశారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..