Tollywood: తండ్రి ఆర్మీ జవాన్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. భర్త కూడా స్టార్ సెలబ్రిటీనే
ప్రస్తుతం మన సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు, హీరోయిన్లలో చాలా మంది ఆర్మీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన వారే. అలా తాజాగా టాలీవుడ్ కు చెందిన ఒక క్రేజీ హీరోయిన్ ఆర్మీ జవాన్ అయిన తన తండ్రి తో కలిసున్న ఒక ఫొటోను షేర్ చేసింది.

పైన ఫోటోలో స్కూటీ మీద ఆర్మీ జవాన్ దగ్గర ఉన్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా? ఈ క్యూటీ ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ సినిమాల్లోనూ సినిమాలు చేసింది. తెలుగులో అయితే మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రామ్ పోతినేని, రవితేజ, గోపీచంద్, నాగార్జున తదితర స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. పలు సూపర్ హిట్స్ అందుకుంది. ఇక బాలీవుడ్ లోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ ఉంది. అజయ్ దేవ్ గణ్, అయుష్మాన్ ఖురానా తదితర స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. కాగా హీరోయిన్ గా కెరీర్ మంచి స్పీడ్ గా ఉన్న టైం లోన ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లైనప్పటికీ ఈ అందాల తార క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. తెలుగులో సినిమాలు చేయకపోయినప్పటికీ బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ పాటికే అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్ ఈ క్యూటీ మరెవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా తన తండ్రి గురించి చెబుతూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
‘ సాయుధ దళాల దినోత్సవం అంతర్జాతీయంగా ఉండవచ్చు. కానీ నా మనసు మా నాన్న యూనిఫాం కోసం కొట్టుకుంటుంది. ఒక ఆర్మీ అధికారి.. తల్లిదండ్రులుగా.. వారి సంరక్షణలో పెరగడం అంటే.. త్యాగం, గౌరవం, బాధ్యతలను ముందుగానే నేర్చుకోవడం. ఈ రోజు, నేను మా నాన్నను మాత్రమే కాకుండా, భారతదేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా.. తనకంటే సేవను మాత్రమే ముఖ్యమని భావించి.. ఆర్మీ ను ఎంచుకునే ప్రతి సైనికుడిని గౌరవిస్తాను. ఇటీవలి కాలంలో మన భారత సైన్యం ధైర్యం, శాంతి ఉచితం కాదని మనకు గుర్తు చసింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఆర్మీ జవాన్ కు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.
రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్ పోస్ట్..
View this post on Instagram
రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..