AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైట్ విషయంలో చిన్నతనంలోనే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా.. యంగ్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కెరీర్ బిగినింగ్ లో అవమానాలు ఎదుర్కొన్నాం అని తెలిపి అభిమానులకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.. తాజాగా ఓ ముద్దుగుమ్మ చిన్నతనంలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా అని తెలిపి షాక్ ఇచ్చింది. ఇంతకూ ఆ యంగ్ బ్యూటీ ఎవరో తెలుసా.? రీసెంట్ గానే భారీ హిట్ అందుకుంది.

హైట్ విషయంలో చిన్నతనంలోనే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా.. యంగ్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
Actress
Rajeev Rayala
|

Updated on: May 19, 2025 | 3:22 PM

Share

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. హీరోలతో సమానంగా క్యారెక్టర్ ఉండే కథలను ఎంపిక చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది తమ నటనతో ఎన్నో అవార్డ్స్ కూడా సొంతం చేసుకున్నారు. కొంతమంది హీరోయిన్స్ కెరీర్ బిగినింగ్ లోనే చాలెంజింగ్ పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. ఈ మధ్యకాలంలో యంగ్ హీరోయిన్స్ చాలా మంది కంటెంట్ ఉన్న సినిమాలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. రీసెంట్ గా ఓ బ్యూటీ చేసిన రెండు సినిమాలతో మంచి విజయాలను అందుకుంది. రీసెంట్ గా ఈ యంగ్ బ్యూటీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మంది విజయాన్ని అందుకుంది. అయితే చాలా మంది హీరోయిన్స్ లానే తాను కూడా ఎన్నో అవమానాలు, తిరస్కరణలు ఎదుర్కొన్నా అని తెలిపింది. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : గోవిందుడు అందరివాడేలేలో ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు చూస్తే చెక్ అవ్వాల్సిందే..

చేసిన రెండు సినిమాలతో భారీ హిట్ అందుకుంది ఈ అమ్మడు. తమిళ్ లో తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. అలాగే ఇప్పుడు తెలుగులోనూ డెబ్యూ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టింది. ఆమె ఎవరో కాదు లేటెస్ట్ సెన్సేషన్ ఇవానా.  ఈ ముద్దుగుమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తమిళ్ లో లవ్ టుడే సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఇవానా రీసెంట్ గా సింగిల్ సినిమా చేసింది.

ఇది కూడా చదవండి : తస్సాదియ్యా..! ఈ ఫొటోలో స్కూల్ డ్రస్ వేసుకున్న రెండు జెళ్ళ పాప గుర్తుందా.? ఇప్పుడెలా ఉందంటే

శ్రీవిష్ణు హీరోగా నటించిన సింగిల్ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఇవానా తన అందంతో పాటు నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది ఇవానా. ఇక ఇప్పుడు ఈ చిన్నదానికి తెలుగులో క్రేజీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇవానా మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. చిన్నతనంలో హైట్ విషయంలో చాలా మంది ఏడిపించేవారు అని తెలిపింది. చిన్నప్పుడు నేను హైట్ తక్కువగా ఉండటంతో చాలా అవమానాలు, రిజక్షన్స్ ఎదుర్కొన్నా. స్కూల్‌లో నన్ను ఫ్రెండ్స్ ‘పొట్టి’ అని ఏడిపించేవారు అని తెలిపింది. వాళ్ల మాటలు చాలా బాధపెట్టేవి దాంతో నేను చదువు పై పెద్దగా దృష్టి పెట్టలేకపోయాను అని తెలిపింది. ఇక చిన్న వయసునుంచే సినిమాల పై ఇంట్రెస్ట్ ఉండేది అని చెప్పుకొచ్చింది. ఇవానాకు తెలుగులో ‘హ్యాపీడేస్’ అంటే చాలా ఇష్టమట. ఈ సినిమా సాంగ్స్ తన ఫెవరెట్ అని తెలిపింది అని చెప్పుకొచ్చింది.. అలాగే  ఫేవరెట్ హీరో అల్లు అర్జున్. ఆయన డ్యాన్స్‌కి పెద్ద ఫ్యాన్ అని తెలిపింది ఇవానా.

ఇది కూడా చదవండి : సీన్ సీన్‌కు సితారే..! దైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన సినిమా మావ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

View this post on Instagram

A post shared by Ivana (@i__ivana_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇండోర్ వన్డే తర్వాత రో-కో మాయం..గుండెలు బాదుకుంటున్న ఫ్యాన్స్
ఇండోర్ వన్డే తర్వాత రో-కో మాయం..గుండెలు బాదుకుంటున్న ఫ్యాన్స్
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్