Custody: లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటున్న నాగ చైతన్య.. కస్టడీ మూవీ నుంచి అందమైన సాంగ్
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఈ మూవీలో నాగ చైతన్య పోలీస్ కానిస్టేబుల్ గా కనిపించనున్నాడు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు వెంకట్ ప్రభు.
అక్కినేని కుర్ర హీరో నాగ చైతన్య నటిస్తోన్న లేటెస్ట్ మూవీ కస్టడీ.హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యువ సామ్రాట్. తమిళ్ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చైతూకి జోడిగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఈ మూవీలో నాగ చైతన్య పోలీస్ కానిస్టేబుల్ గా కనిపించనున్నాడు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు వెంకట్ ప్రభు. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ లో చైతన్య రెట్రో లుక్ లో కనిపించి అలరించారు.
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంతే అయ్యిందిలా.. చూస్తేనే ఎంతో నచ్చేసిందా బుజ్జీ పిల్లా అంటూ సాగుతున్న పాట ఆకట్టుకుంటుంది. రామజోగయ్య శాస్త్రి రాయగా.. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించారు. యువన్ శంకర్ రాజా కపిల్ కపిలన్ పాటను పాడారు.
కస్టడీ మే 12వ తేదీన రిలీజ్ కాబోతుంది. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. కస్టడీ సినిమాలో చైతన్య మరోసారి తన నటనతో ఆకట్టుకోనున్నాడని టీజర్, ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ఈ సినిమాతో చైతన్య హిట్ అందుకోవడం ఖాయం అంటున్నారు అక్కినేని అభిమానులు.