Devara : సముద్రాన్ని ఎరుపెక్కించిన తారక్.. దేవర ఫస్ట్ గ్లింప్స్ డేట్ లాక్
మరోసారి యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ ఇప్పుడు సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ సోలోగా వచ్చి దాదాపు ఆరేళ్ళు అవుతుంది. అరవింద సమేత సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించాడు. ఇక ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు దేవర అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు.

ఆర్ఆర్ఆర్ సినిమాతో మల్టీస్టార్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో తారక్ కొమురం భీమ్ గా నటించి మెప్పించాడు. తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించిన తారక్ ఇప్పుడు మరోసారి యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ ఇప్పుడు సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ సోలోగా వచ్చి దాదాపు ఆరేళ్ళు అవుతుంది. అరవింద సమేత సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించాడు. ఇక ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు దేవర అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ఇప్పటికే శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
ఈ సినిమాలో తారక్ కు జోడీగా బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో జాన్వీ టాలీవుడ్ కు పరిచయం అవుతుంది. అలాగే ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకోసం తారక్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమానుంచి ఇప్పుడు క్రేజీ అప్డేట్ ఇస్తున్నారు మేకర్స్.
ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలన్న కసితో ఉన్నారు కొరటాల శివ. ఈ క్రమంలోనే దేవర సినిమాను చాలా పకడ్బందీగా తెరకెక్కిస్తున్నాడు. దేవర సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను జనవరి 8న విడుదల ఆటే సోమవారం విడుదల చేయనున్నారు. సాయంత్ర 4 గంటల 5 నిమిషాలకి ఈ వీడియోను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో చిన్న వీడియోను వదిలారు. సముద్రం అలలతో కత్తికి అంటిన రక్తాన్ని కడుగుతున్నట్టు చూపించారు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Unleashing fear in 2 days 🌊🌊🌊
Man of Masses #NTR’s #DevaraGlimpse will deliver a massive feast on Jan 8th at 4:05 PM 🔥#Devara@tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @NANDAMURIKALYAN @RathnaveluDop @sabucyril @sreekar_prasad @Yugandhart_ @YuvasudhaArts… pic.twitter.com/RUP0WYm93j
— Anirudh Ravichander (@anirudhofficial) January 6, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




