Vijay Devarakonda: రౌడీ హీరో క్రేజ్‌కు ఇది మరో ఉదాహరణ.. టాప్‌ హీరోలను సైతం వెనక్కి నెట్టేసి మరీ..

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ.. ఇప్పుడు ఈ పేరే ఒక బ్రాండ్‌గా మారిపోయింది. అత్యంత తక్కువ సమయంలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు విజయ్‌. చిన్న హీరోగా కెరీర్‌ మొదలు పెట్టిన విజయ్‌ ఇప్పుడు ఏకంగా..

Vijay Devarakonda: రౌడీ హీరో క్రేజ్‌కు ఇది మరో ఉదాహరణ.. టాప్‌ హీరోలను సైతం వెనక్కి నెట్టేసి మరీ..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 31, 2022 | 5:35 PM

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ.. ఇప్పుడు ఈ పేరే ఒక బ్రాండ్‌గా మారిపోయింది. అత్యంత తక్కువ సమయంలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు విజయ్‌. చిన్న హీరోగా కెరీర్‌ మొదలు పెట్టిన విజయ్‌ ఇప్పుడు ఏకంగా పాన్‌ ఇండియా హీరోగా మారారు. అర్జున్‌ రెడ్డితో నేషనల్‌ వైడ్‌గా క్రేజ్‌ దక్కించుకున్న విజయ్‌ ఇప్పుడు లైగర్‌తో బాలీవుడ్‌లోనూ పాగా వేయడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో విజయ్‌ క్రేజ్‌ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే పలు బడా సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విజయ్‌ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.

ఇప్పటి వరకు తమ సంస్థకు బ్రాండ్‌ అబాసిడర్‌గా మహేష్‌ బాబును కొనసాగించిన థమ్స్‌అప్‌ తాజాగా విజయ్‌ని నియమించుకుంది. హిందీలో బ్రాండ్‌ అంబాసిడర్‌లను మారుస్తూ వచ్చినా తెలుగులో మాత్రం మహేష్‌నే కొనసాగించారు. అయితే చాలా రోజుల తర్వాత థమ్స్‌అప్‌ తన బ్రాండ్‌ అబాసిడర్‌ను మార్చేసింది. రౌడీ హీరో విజయ్‌ దేవరకొండను కొత్త బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. తాజాగా విజయ్‌ దేవరకొండ సోషల్‌ మీడియాలో తన ప్రొఫైల్ పేరు పక్కన తుఫాన్‌ అనే పదాన్ని చేర్చడంతో అంతా షాక్‌ అయ్యారు.

విజయ్‌ పేరును ఎందుకిలా మార్చారు అనుకున్నారు. తాజాగా థమ్స్‌అప్‌ ఈ విషయాన్ని ప్రకటించడంతో అందరికీ క్లారిటీ వచ్చేసింది. తమ సంస్థకు విజయ్‌ కొత్త బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారన్న విషయాన్ని తెలుపుతూ.. ‘మన రౌడీ విజయ్‌ దేవరకొండ కొత్త అవతారాన్ని చూడడానికి వేచి చూడండి. థమ్స్‌ అప్‌, సాఫ్ట్‌ డ్రింక్‌ కాదు, ఇది తుఫాన్‌’ అంటూ థమ్స్‌అప్‌ యాజమాన్యం ట్వీట్‌ చేసింది. ఇలా అత్యంత తక్కువ సమయంలో బడా బ్రాండ్‌కు అంబాసిడర్‌గా మారడంతో విజయ్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. మరీ ఈ కొత్త బాధ్యత చేపట్టినందుకు విజయ్‌ తీసుకునే మొత్తం ఎంతో తెలియాల్సి ఉంది.

Also Read: Ricky Ponting: టీమ్‌ ఇండియా టెస్ట్‌ కెప్టెన్‌గా నా మద్దతు అతడికే..?

T20I Cricket: టీ20ఐ హ్యాట్రిక్ లిస్టులో 26 మంది బౌలర్లు.. ఈ నలుగురు మాత్రం చాలా స్పెషల్.. ఎందుకంటే?

Commerce Ministry: దశాబ్దాల కాలం నాటి చట్టాల రద్దుపై కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రతిపాదించిన వాణిజ్య మంత్రిత్వశాఖ!