AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NBK in Aha OTT: బాలయ్య షో రెండో సీజన్.. అదిరిపోయే న్యూస్.. ఆ స్టార్ హీరోతోనే ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అంటూ..

NBK in Aha OTT: నందమూరి నటసింహం బాలకృష్ణ ( NBK) వెండి తెరపైనే కాదు.. ఓటీటీ(OTT) వేదికపైనా తన సత్తా చాటారు. అన్‌ స్టాపబుల్‌ టాక్‌ షో హోస్ట్‌గా వ్యవహరించి, రికార్డులు సృష్టించాలన్నా.. తిరగ రాయాలన్నా..

NBK in Aha OTT: బాలయ్య షో రెండో సీజన్.. అదిరిపోయే న్యూస్.. ఆ స్టార్ హీరోతోనే ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అంటూ..
Chiru Balayya
Surya Kala
| Edited By: Janardhan Veluru|

Updated on: Jan 31, 2022 | 6:10 PM

Share

NBK in Aha OTT: నందమూరి నటసింహం బాలకృష్ణ ( NBK) వెండి తెరపైనే కాదు.. ఓటీటీ(OTT) వేదికపైనా తన సత్తా చాటారు. అన్‌ స్టాపబుల్‌ టాక్‌ షో హోస్ట్‌గా వ్యవహరించి, రికార్డులు సృష్టించాలన్నా.. తిరగ రాయాలన్నా మేమే అని నిరూపించారు. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. అసలు బాలయ్యను హోస్ట్‌గా పెట్టాలన్న ఆలోచన వచ్చినప్పుడే షో సగం సక్సెస్ అయింది. మిగిలిన సగం బాలకృష్ణ తన భుజాన వేసుకున్నారు. వచ్చిన ప్రతి గెస్టుతో అద్భుతంగా మాట్లాడుతూ ఇండియాలోనే అత్యధిక imdb రేటింగ్ సాధించిన టాక్ షోగా దీన్ని నిలబెట్టారు.

సీజన్ 1 మొదటి ఎపిసోడ్‌ను మోహన్ బాబుతో మొదలు పెట్టి.. చివరి ఎపిసోడ్ మహేశ్‌ బాబుతో షూట్ చేశారు. ఫిబ్రవరి 4న ఇది ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా రోజుల తర్వాత ఒక టాక్ షోకి వచ్చిన మహేష్ ఇక్కడ చాలా ఓపెన్‌గా మాట్లాడారు. ఈ ఎపిసోడ్‌ కోసం అటు నందమూరి.. ఇటు ఘట్టమనేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సీజన్ 2 గురించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.

తొలి సీజన్ బ్లాక్ బస్టర్ కావడంతో రెండో సీజన్ కోసం సన్నాహాలు మొదలు పెట్టారు నిర్వాహకులు. అంతేకాదు సెకండ్ సీజన్ లో వచ్చే వ్యక్తులు కూడా మరింత ప్రత్యేకంగా ఉండబోతున్నారు. మొదటి సీజన్ లో అందరూ ఎక్కువగా వేచి చూసింది చిరంజీవి కోసం. ఎందుకంటే బాలయ్య, చిరంజీవి ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే అభిమానులకు పండగే. పైగా ఆహా అల్లు అరవింద్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కావ‌డంతో కచ్చితంగా మొదటి సీజన్‌లోనే అది జరుగుతుందని అందరూ అనుకున్నారు. అయితే అనివార్య కారణాలతో చిరంజీవి రావడం కుదరలేదు. అందుకే సీజన్ 2 మొదటి ఎపిసోడ్ చిరంజీవితో మొదలుపెట్టాలని నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. అలాగే వెంకటేశ్‌, నాగార్జున, పవన్ కళ్యాణ్ సహా ఇండస్ట్రీలో ఉన్న మరికొందరు స్టార్ హీరోలతో unstoppable సీజన్ 2 నిర్వహించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే కనుక జరిగితే ఆహా రేంజ్ ఎక్కడికో… వెళ్లిపోతుంది. ఇదిలా ఉంటే సెకండ్ సీజన్ కోసం బాలయ్య పారితోషికం కూడా రెండింతలు పెరిగినట్లు తెలుస్తోంది. మొదటి సీజన్ కోసం 12 ఎపిసోడ్ లకు 4 కోట్లు పారితోషికం అందుకున్నాడు బాలయ్య.

Also Read:

 తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా.. వణుకుతున్న ప్రజలు.. మరో రెండు రోజుల్లో పెరగనున్న చలి తీవ్రత..