AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Song: ఏం ఉన్నాయ్ భయ్య లిరిక్స్.. కుర్రాళ్లు మళ్లీ మళ్లీ వింటున్న పాట.. 2012 నుంచి యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్..

సంగీతం.. మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. అందుకే బాధొచ్చినా, మానసికంగా కుంగిపోయినా.. పట్టలేనంత సంతోషం వచ్చినా ఎక్కువ మంది చేసే పని పాటలు వినడం. అయితే కొన్ని పాటల్లో సాహిత్యం హృదయాన్ని తాకుతుంది. కొన్ని లిరిక్స్ వింటుంటే ఎంతో గొప్పగా అనిపిస్తాయి. జీవితం మీద నిరాశ కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పాట వింటే చాలు. 2012 నుంచి యూట్యూబ్ ను షేక్ చేస్తుంది ఈ సాంగ్.

Trending Song: ఏం ఉన్నాయ్ భయ్య లిరిక్స్.. కుర్రాళ్లు మళ్లీ మళ్లీ వింటున్న పాట.. 2012 నుంచి యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్..
Trending Song
Rajitha Chanti
|

Updated on: Aug 08, 2026 | 8:14 PM

Share

ప్రస్తుతం జెన్ జీ కుర్రాళ్లు ఒక పాటకు తెగ అట్రాక్ట్ అయిపోయారు. ఈ పాటను మళ్లీ మళ్లీ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. 2012లో విడుదలైన ఒక సినిమాలోని పాట ఇప్పుడు అందరి హృదయాలను తాకుతుంది. మరీ ఆ పాట గురించి తెలుసుకుందామా. మంచు మనోజ్ కథానాయకుడిగా వచ్చిన ‘మిస్టర్ నూకయ్య’ చిత్రంలోని ‘ఒకే ఒక జీవితం ఇది చెయ్యి జారిపోనీకు.. మళ్లీ రాని ఈ క్షణాన్ని మన్నుపాలు కానీకు’. ఈ సాంగ్ గురించి చెప్పక్కర్లేదు. విడుదలై 14 సంవత్సరాలు గడిచినప్పటికీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. సంవత్సరాలుగా ఈ సాంగ్ అందరి హృదయాలను గెలుచుకుంటుంది. ఈ పాట ఎంతోమందికి నిరాశలో ఆశల దీపంలా నిలిచింది. ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం, యువన్ శంకర్ రాజా మనసును తాకే సంగీతం, హరిచరణ్ గాత్రం ఈ పాటను తెలుగు చలనచిత్ర చరిత్రలోనే అత్యుత్తమ మోటివేషనల్ సాంగ్స్‌లో ఒకటిగా నిలబెట్టాయి. ముఖ్యంగా ఈ పాటలోని లిరిక్స్ ఎంత గొప్పగా ఉంటాయో చెప్పక్కర్లేదు.

ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..

జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సవాళ్లకు లొంగిపోకుండా ధైర్యంగా ముందడుగు వేయాలని ఈ పాట తెలియజేస్తుంది. “కష్టమనేది లేని రోజంటూ లేదు కదా.. కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా” అంటూ ప్రతి మనిషి ఎదుర్కొనే భావోద్వేగాలను, జీవిత సత్యాలను ఎంతో సరళంగా వివరించారు. పుట్టుక నుంచి చివరి వరకు మనిషి ప్రయాణం ఒంటరిదేనని, అందుకే వేరొకరి సహాయం కోసం ఎదురుచూడకుండా “నిన్ను నువ్వు నమ్ముకో” అని ఇచ్చే సందేశం ఎంతో స్ఫూర్తిదాయకం అనే చెప్పాలి.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..

మానసిక ఒత్తిడి, అసఫలతలు ఎదురైనప్పుడు అధైర్యపడే అనేకమందికి ఈ పాట ఒక మంచి కౌన్సిలింగ్‌లా పనిచేస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా చిరునవ్వు చెరగకుండా జీవించాలని, సమయాన్ని వృథా చేయకుండా ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని చెప్పే ఆలోచన ప్రతీ ఒక్కరిలో కొత్త ఆశలను చిగురింపజేస్తుంది. ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఈ పాట అందించే ఆశావాద ధోరణి , ఆత్మవిశ్వాసం యువతతో పాటు ప్రతిఒక్కరి హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. జీవితంపై విరక్తి చెందిన వారికి కూడా మళ్లీ జీవించాలనే కొత్త ఆశను, నమ్మకాన్ని కలిగించే శక్తివంతమైన పాట ఇది. అందుకే మీరు ఒకసారి వినండి..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..

ఒకే ఒక జీవితం సాంగ్..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..

Follow Us