Upcoming movies: ఈ వారం థియేటర్లలో.. ఓటీటీలో వచ్చే సినిమాలు ఇవే.. ఆన్‏లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ రెడీ..

అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 3 సినిమాతోపాటు.. డిజిటల్ ప్లాట్ ఫాంపై వినోదాన్ని పంచే సినిమాలు విడుదల కాబోతున్నాయి.

Upcoming movies: ఈ వారం థియేటర్లలో.. ఓటీటీలో వచ్చే సినిమాలు ఇవే.. ఆన్‏లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ రెడీ..
F3
Follow us
Rajitha Chanti

|

Updated on: May 23, 2022 | 11:17 AM

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సర్కారు వారి పాట మేనియా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మే 12న విడుదలైన ఈ సినిమా థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఇక ఇప్పుడు ఈ వారం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు పలు చిత్రాలు రాబోతున్నాయి. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 3 సినిమాతోపాటు.. డిజిటల్ ప్లాట్ ఫాంపై వినోదాన్ని పంచే సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరీ ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో విడుదల కాబోతున్న చిత్రాలు ఎంటో తెలుసుకుందామా..

ఎఫ్ 3.. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తోన్న చిత్రం ఎఫ్ 3. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా నటించారు. గతంలో సూపర్ హిట్ అయిన ఎఫ్ 2 సినిమాకు సిక్వెల్ గా రాబోతున్న ఈ సినిమా మే 27న థియేటర్లలో విడుదల కానుంది. ఎఫ్ 2 మించి ఈ సినిమా ఉండబోతున్నట్లు డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు. ఈ కాలంలో డబ్బు విలువ తెలియని వారికి ఈ సినిమా చూస్తే తప్పకుండా తెలుస్తుందన్నారు..

ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు… కాతు వాకుల రెండు కాదల్.. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా కాతు వాకుల రెండు కాదల్ (కణ్మణి ర్యాంబో ఖతిజా ). తమిళ్ తోపాటు తెలుగులో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మే 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

అటాక్ట్ పార్ట్ 1.. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అటాక్ పార్ట్ 1. ఇందులో ప్రకాష్ రాజ్, రకుల్ ప్రీత్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలకపాత్రలలో నటించారు. ఏప్రిల్ 1న విడుదలైన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ జీ5లో మే 27న స్ట్రీమింగ్ కానుంది.

నెట్ ఫ్లిక్స్.. ద లాడ్జ్.. హాలీవుడ్.. మే 22 వెల్ కమ్ టు వెడ్డింగ్ హెల్.. హాలీవుడ్.. మే 23 తులసీ దాస్ జీనియర్..హిందీ.. మే 23

జీ 5.. ఫోరెన్సిక్..హిందీ.. మే 24

డిస్నీప్లస్ హాట్ స్టార్.. ఒబీ వ్యాన్ కెనోబీ.. వెబ్ సిరీస్.. మే 27

సోనీ లివ్.. నిర్మల్ పాఠక్ కీ ఘర్ వాపసీ.. హిందీ.. మే 27

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు