Vishal: విశాల్ పాన్ ఇండియా సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. లాఠీ మూవీ విడుదలయ్యేది ఎప్పుడంటే..

యాక్షన్ హీరో విశాల్ కధానాయకుడిగా ఎ.వినోద్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'లాఠీ' (Laatti).

Vishal: విశాల్ పాన్ ఇండియా సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. లాఠీ మూవీ విడుదలయ్యేది ఎప్పుడంటే..
Vishal
Follow us
Rajitha Chanti

|

Updated on: May 23, 2022 | 7:00 AM

తమిళ్ స్టార్ హీరో విశాల్ (Vishal) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. ఆయన నటించిన తమిళ్ చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ యాక్షన్ హీరో విశాల్ కధానాయకుడిగా ఎ.వినోద్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’ (Laatti). హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విశాల్ సరసన ఈ చిత్రంలో సునైనా కథానాయికగా నటిస్తుంది.

తాజాగా ఓ పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా లాఠీ విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు. ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీగా విడుదల కానుంది. రిలీజ్ డే ఎనౌన్స్ మెంట్ పోస్టర్ లో విశాల్ యాక్షన్ లుక్ ఆకట్టుకుంది. ఒంటినిండా గాయాలు, రక్తం కారుతున్నా నవ్వుతూ కనిపించడం విశాల్ పాత్రలోని హై ఇంటెసిటీని తెలియజేస్తుంది. సమాజంలో మార్పు తెచ్చే శక్తి లాఠీకి వుంది. విశాల్‌ ఆ ‘లాఠీ’ తో సమాజంలో ఎలాంటి మార్పులకు నాంది పలికారో అన్నది ఆసక్తికరం. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి అన్ని భాషలకు ఒకే టైటిల్‌ పెట్టారు. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ని దర్శకుడు వినోద్‌ కుమార్‌ సరికొత్త కథాంశంతో తెరకెక్కించారు. ఈ చిత్రంలో విశాల్ ఫుల్ లెంత్ యాక్షన్ కి ప్రాధాన్యత వున్న పాత్రలో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రం కోసం అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ద్వితీయార్ధంలో ఉండే 45నిమిషాల యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. దిలీప్‌ సుబ్బరాయణ్‌ మరో స్టంట్ మాస్టర్ గా పనిచేశారు. బాలసుబ్రమణ్యన్‌ ఛాయాగ్రహకుడిగా, సామ్‌ సిఎస్‌ సంగీత దర్శకుడిగా, పొన్ పార్థిబన్ రచయితగా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే