Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raghavendra Rao: దర్శకేంద్రుడి సినీ ప్రేమలేఖ.. ఎంతని చెప్పాలి.. ఏమని చెప్పాలి.. భయమంటూ..

మే 23న దర్శకేంద్రుడి జన్మదినం. ఈరోజుతో ఆయన నేటితో ఆయన 80వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు.

Raghavendra Rao: దర్శకేంద్రుడి సినీ ప్రేమలేఖ.. ఎంతని చెప్పాలి.. ఏమని చెప్పాలి.. భయమంటూ..
Raghavendra Rao
Follow us
Rajitha Chanti

|

Updated on: May 23, 2022 | 7:33 AM

వెండితెరపై తెలుగు సినిమాకు ఓ దృష్యాకావ్యంగా మలిచిన దర్శకుడు రాఘవేంద్రరావు(K. Raghavendra Rao).. ఆయన సినిమా తెరకెక్కిస్తే బాక్సాఫీసులకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేస్తారు.. ఆధ్యాత్మిక చిత్రాలనే కాకుండా.. ప్రేమకథా చిత్రాలను.. కుటుంబ చిత్రాలను ప్రేక్షకుల మనసులను తాకేలా రూపొందించడంలో ఆయనకు ఆయనే సాటి. తెరపై హీరోయిన్లను ప్రేక్షకులకు పరిచయడం చేయడంలో రాఘవేంద్రుడి స్టైలే వేరు.. ఆయన ప్రస్థానం ఓ చరిత్ర. వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి ఎంతో మంది నటీనటులను స్టార్స్‏గా మార్చి తెలుగు తెరకు దర్శకేంద్రుడిగా మారారు కోవెలమూడి రాఘవేంద్రరావు.. మే 23న దర్శకేంద్రుడి జన్మదినం. ఈరోజుతో ఆయన నేటితో ఆయన 80వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్బంగా..తాను సినిమాకు రాసుకున్న ప్రేమలేఖ అనే పుస్తకాన్ని రాసినట్లు తెలిపారు.. ఇటీవలే ఈ పుస్తకాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వెంకటరమణ అభినందనతో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధామూర్తి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈరోజు రాఘవేంద్రుడి పుట్టిన రోజు సందర్భంగా ఈ ” నేను సినిమాకు రాసుకున్న ప్రేమలేఖ” గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

” ఈ జన్మదినం ప్రత్యేకత ఏంటంటే, దర్శకునిగా శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించాను. ఈ అనుభవంతో ఓ పుస్తకాన్ని రాశాను. అది 1963వ సంవత్సరం ఆరోజు నాకు ఇంకా కళ్లముందే ఉంది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ మొదటిరోజున‘పాండవ వనవాసం’చిత్రానికి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్టీఆర్‌పై తొలిసారి క్లాప్‌కొట్టటంతో నా కెరీర్‌ స్టార్టయింది. ప్రముఖ దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారు నాకు తొలిసారి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. 10 ఏళ్లపాటు అసిస్టెంట్ గా పనిచేసిన తర్వాత మా నాన్నగారు కె.యస్‌ ప్రకాశ్‌రావుగారు అందించిన ‘బాబు’ (1975) చిత్రంతో దర్శకునిగా సినిమా ప్రయాణం. ఆ రోజు నుండి మొదలైన నా సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలు, అపజయాలు, ఆనందాలు, ఎత్తులు, లోతులు అవార్డులు, రివార్డులు ఎన్నిచూసుంటాను. 48 ఏళ్ల దర్శకత్వ సుదీర్ఘ ప్రయాణం గురించి ఎంతని చెప్పాలి, ఏమని చెప్పాలి. అందుకే 80 ఏళ్ల నా జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకోవాలనే ఉద్ధేశ్యంతో ‘‘నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ’’అంటూ నా స్వహస్తాలతో నేను ఓ పుస్తకం రాసుకున్నాను. ఆ పుస్తకంలో నేను నడిచిన సినిమా దారిలో ఎంతోమంది స్నేహితులు, బంధువులు, ఆప్తులు, నన్ను నమ్మి నాతో పాటు నడిచిన నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లతో పాటు , రచయితలతో పాటు ఎంతోమందిని గుర్తు చేసుకోవాలి అనుకున్నాను. అనుభవం నేర్పిన కొన్ని విషయాలను రాయాలనిపించింది. అందుకే నా ఈ (నా) ప్రేమలేఖల్ని మీ ముందు ఉంచుతన్నాను. నా ఈ స్థితికి కారణమైన 24 శాఖలవారికి అన్నింటికంటే ముఖ్యంగా ప్రేక్షకులకి నా గురించి, నేను నేర్చుకున్న పాఠాల గురించి ‘‘అబద్దాలు రాయటం అనర్ధం, నిజాలు రాయటానికి భయం, …అంటూ మనసు పెన్‌తో రాశాను, ఓపెన్‌గా రాశాను. ఏది కప్పి చెప్పలేదు, విప్పి చెప్పలేదు, కొంచెం తీపి, కొంచెం కారం, కొంచెం…..’’ అంటూ తన బుక్‌ గురించి చెప్పుకొచ్చారు దర్శక దిగ్గజం దర్శకేంధ్రుడు కె.రాఘవేంద్రరావు. చివరగా నేను చెప్పేదొక్కటే ‘సినిమా అనేది ఇలానే ఉండాలి అనే గీత గీయకూడదు, ఇలా కూడా ఉండొచ్చు అని ఈ మధ్య విడుదలైన చాలా సినిమాలు నిరూపించాయి. ఈ పుస్తకం ప్రతి పుస్తకాలయాల్లో దొరుకుతుంది. పాఠలకులందరూ పుస్తకాన్ని చదివి ఆశీర్వదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా…

ఇవి కూడా చదవండి

కె.రాఘవేంద్రరావు