Pawan Kalyan: పవన్ పుట్టిన రోజున అదిరిపోయే సర్‏ప్రైజ్‏లు.. ఈరోజు వరుస అప్‏డేట్స్.. ఫ్యాన్స్‏కు ఇక పండగే..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Sep 02, 2021 | 8:16 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‏కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాన్యుల నుంచి సెలబ్రెటీ వరకు

Pawan Kalyan: పవన్ పుట్టిన రోజున అదిరిపోయే సర్‏ప్రైజ్‏లు.. ఈరోజు వరుస అప్‏డేట్స్.. ఫ్యాన్స్‏కు ఇక పండగే..
Pawan Kalyan

Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‏కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాన్యుల నుంచి సెలబ్రెటీ వరకు పవన్ కళ్యాణ్ విపరీతంగా అభిమానిస్తుంటారు. ఇక పవన్ ఫ్యాన్స్‏కు ఆయనపై ఉండే అభిమానం గురించి తెలిసిందే. పవన్ కోరితే ప్రాణాలైన ఇచ్చేస్తారు.. పవన్ కళ్యాణ్‏ను ఆరాదించి.. అభిమానించేవారిలో అటు అబ్బాయిలే.. అమ్మాయిలు కూడా సమానంగానే ఉంటారు. ఇక పవన్ సినిమా విడుదలవుతుందంటే.. ఆయన అభిమానులకు పండగే. అటు సోషల్ మీడియాలో, ఇటు థియేటర్లలోనూ వీరు చేసే రచ్చ మాములుగా ఉండదు. అలాగే అభిమానులపై కూడా పవన్ కేరింగ్‏గా చూస్తుంటారు. ఇక పవన్ కళ్యాణ్‏కు ప్రతి చిన్న విషయాన్ని వేడుకల చేస్తుంటారు. అలాగే పవర్ స్టార్ బర్త్ డే అంటే ఊరుకుంటారా. ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. గత రెండు రోజుల ముందు నుంచే ఆయన అభిమానులు సోషల్ మీడియాలో సందడి మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అటు పవన్ రేర్ ఫోటోస్, రోడ్స్ పై బ్యానర్స్ ఇలా పలు రకాలుగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే.. ఈరోజు పవన్ పుట్టినరోజు కానుకగా ఆయన తదుపరి చిత్రాలకు సంబంధించిన వరుస అప్డేట్స్ రానున్నాయి. దీంతో పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం వరుస చేతినిండా సినిమాలతో బిజీగా గడిపేస్తున్నాడు. ఇటీవలే వకీల్ సాబ్ సూపర్ హిట్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ ప్రస్తుతం భీమ్ల నాయక్, హరిహరవీరమల్లు సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే ఈరోజు పవన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ క్యూ కట్టనున్నాయి. ఈరోజు ఉదయం 11.16 గంటలకు భీమ్ల నాయక్ నుంచి ఫస్ట్ సింగిల్ రానుంది. ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చేస్తున్న పీరియాడికల్ మూవీ హిరి హర వీరమల్లు నుంచి మధ్యాహ్నాం 1.20 నిమిషాలకు అప్డేట్ రాబోతుంది. ఇక సురేందర్ రెడ్డి దర్సకత్వంలో రాబోతున్న సినిమాకు సంబంధించిన అప్డేట్ మధ్యాహ్నం 2.20 నిమిషాలకు అప్డేట్ రానుంది. ఇక ఆ తర్వాత హరీష్ శంకర్ మూవీ అప్డేట్ సాయంత్రం 4.05 నిమిషాలకు అప్డేట్ రా‏నుంది. దీంతో ఈరోజు పవన్ తదుపరి చిత్రాల వరుస అప్డేట్స్‏తో అభిమానులకు ఆనందానికి అవధులు లేవు.

Also Read: Viral Video: పెళ్లి మండపంలో వధువుతో వరుడు సరసాలు.. వీడియో చూస్తే ఫిదా కావాల్సిందే.!

YSR: వైఎస్‌ విజయమ్మ నేతృత్వంలో ఇవాళ హైదరాబాద్‌లో YSR సంస్మరణ సభ.. టాలీవుడ్ హీరోలు సహా నేతల హాజరుపై సస్పెన్స్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu