Pawan Kalyan Birthday: విలక్షణ వ్యక్తిత్వం ఆయన సొంతం.. హీరోగా..పార్టీ అధినేతగా, అశేష అభినులను సొంతం చేసుకున్న జనసేనానాని పుట్టిన రోజు నేడు
Pawan Kalyan: నేడు జనసేనాని పవన్ కళ్యాణ్ 50 వ పుట్టిన రోజు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం సామాన్యుడి నుంచి సెలబ్రెటీ వరకూ ఆయనకు అభిమానులను చేసింది. అవును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వపరంగా..
Pawan Kalyan: నేడు జనసేనాని పవన్ కళ్యాణ్ 50 వ పుట్టిన రోజు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం సామాన్యుడి నుంచి సెలబ్రెటీ వరకూ ఆయనకు అభిమానులను చేసింది. అవును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వపరంగా ఒక విలక్షణమైన వ్యక్తి. అది తనతో పరిచయం ఉన్నవాళ్ళకి, తన అభిమానులకి కూడా బాగా తెలుసు. తనలో ఎక్కువ సామజిక సృహ దేశంకోసం మరేదో చెయ్యాలనే తపన, తన మాటల్లో తన చేతల్లో తన సినిమాల్లో మనం తరచూ చూస్తుంటాం. అది బహుశా ఆయన పెరిగిన వాతావరణం వల్ల కావచ్చు లేదా తను చుట్టూ చుసిన సమాజం కావచ్చు లేదా తనకు స్వయంగా ఎదురైన అనుభవాలు కావచ్చు లేదా తాను ఎక్కువగా చదివిన సోషలిస్టు, కమ్యూనిస్టు తరహా పుస్తకాల ప్రభావం వల్ల కూడా కావచ్చు. అందువల్ల ఆయనలో ఈ దేశంలో ఈ సమాజంలో ఉన్న అంతరాలు మరియు ప్రజలకి జరుగుతున్న అన్యాయం పట్ల నిరంతర మధనం వల్ల ఆయన అలా భిన్నంగా ఉన్నారని కూడా చెప్పవచ్చు. తను ఒకపక్క సినిమాలు చేస్తున్నప్పటికీ తన వంతుగా నమాజానికి దేశానికి ఏమి చెయ్యాలి అనే బాధ తనకి ఖుషి సినిమా నుండే ఉండేదని ఆయనే స్వయంగా చెప్పారు కూడా. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు అవినీతిపరుల అరాచకాలు ఇవన్ని తెలిసిన నేను కూడా ఇంట్లో కూర్చొని నా జీవితం నా సినిమాలు అని చూసుకుంటే ఇక ప్రజల సమస్యలు ఎలా తీరతాయని ఆయన అంటారు. మరోవైపు సామాన్యుల వెతలు ఎవరు చూస్తారనే ఆవేదన ఉండడంవల్ల తాను జనసేన పార్టీ పెట్టేలా చేశాయని స్వయంగా పవన్ కళ్యాణ్ పోరాటయాత్ర సభల్లో చెప్పినమాట కాదనలేని సత్యం..
పవన్ వ్యక్తిత్వం గురించి రెండు మాటల్లో:
అసలు ఆయనకు ఎమి తక్కువ? డబ్బు కావాలంటే వందల, వేలకోట్లు సంపాదించే స్థితి, స్థాయి ఉంది. సంఘంలో పెద్ద పేరు ఉంది. ఇవన్నీ పక్కన పెట్టి సేవ చెయ్యాలని ఆలోచనతో రాజకీయంలోకి అడుగుపెట్టారు. ఆయన ఏమి చేసినా నిరంతరం ప్రజలకు ఎదో చెయ్యాలనే తపన ఉంది. స్వతహాగా అంతర్ముఖంగా ఉండే పవన్ తాను బాహ్య ప్రపంచంలో ఉండడం కన్నా తనకు పుస్తక ప్రపంచం ఎక్కువ సంతృప్తిని ఇస్తుందని కూడా ఎన్నోసార్లు చెప్పడం చూశాము. ఇక ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహితులు కూడా పవన్ చిన్నప్పటి తన ప్రపంచం ఎప్పుడూ వేరేగా ఉండేదని, ఎక్కువగా ఎవరితో మాట్లాడే మనిషి కాదని చెప్పడం కూడా చూశాము. సమాజహితం కోసం ఏదైనా చెయ్యాలనే ఆలోచనతో ఒక స్వచ్చంద సంస్థ పెడితే, న్యాయం జరుగుతుందని ఆయన ఆలోచించి పెట్టిందే “కామన్ మాన్ ప్రొటెక్షన్ ఫోర్స్(సీపీఎఫ్)” అనే స్వచ్చంద సంస్థ.
తను అనుకున్నది చేయాలనే మనస్థత్వం ఉన్న ఆయన, ప్రజలకి న్యాయం చెయ్యాలంటే ముందుకే వెళ్ళాలని, ఎవరు అడ్డు చెప్పినా ఆగనంటూ తనే సొంత పార్టీ దిశగా అడుగులు వేసుకుంటూ తాను ఒక్కడుగా, ఇంత పెద్ద రాజకీయ చదరంగంలోకి ప్రజలే న్యాయనిర్దేతలుగా 14 మార్చి 2014న “జనసేన పార్టీ” ఆవిర్భావానికి శ్రీకారం చుట్టారు. ఇక ఆయనే స్వయంగా ఎన్నోసార్లు చెప్పినట్టు, తను గొప్ప నటుడేమి కాదు. తానొక ఆక్సిడెంటల్ నటుడని ఎన్నో సందర్భాల్లో చెప్పారు కూడా. కానీ తన వ్యక్తితం, భిన్నశైలి నటుడిగా ఆయనకు విపరీతమైన అభిమానులని సంపాదించి పెట్టిందనడంలో సందేహం లేదు.
పవన్‌కళ్యాణ్‌లోని మరో గొప్ప విషయం.
ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు బహిరంగంగా ఒప్పుకోవడం. అది తన వ్యక్తిగత జీవితం అయినా రాజకీయం జీవితం అయినా తన కుటుంబంతో ఉన్న అనుబంధం అయినా, ఇలా ఏదైనా ఆయన ఉన్నది ఉన్నట్టు చెపుతారు. నేను ఏదైనా తప్పు చేసినా అది ప్రజల దగ్గర బహిరంగంగా ఒప్పుకుంటాను అంటూ ఆయన అనడం అందరికి సాధ్యం అయ్యే విషయం కాదు. మొహమాట పడడం లేక దాచిపెట్టడం చేయనని అంటారు కూడా. నా జీవితం తెరచిన పుస్తకం, మీలా నేను ఏది దాచుకోను అది నా పెళ్ళిళ్ళు అయినా నా రాజకీయ జీవితం అయినా అంటూ పోరాటయాత్రలో చెప్పడం ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనమని ఆయన కార్యకర్తల మాట.
అందరికి సుపరిచయంమైన ‘పవర్‌స్టార్’
ఆయన్ను ఇంట్లో అందరూ ముద్దుగా కళ్యాణ్‌బాబు అన్నా… అభిమానులు మా పవర్‌స్టార్ అన్నా… తన అనుచరగణం పవనిజం అన్నా… కొందరు ఏకంగా దేవుడు అన్నా… వేలాది లక్షలాది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకొన్న పవన్‌కళ్యాణ్ జనసేన అనే పార్టీ స్థాపించారు. పార్టీ పెట్టిన నాటి నుండి నేటివరకు ఎంతోమందితో ఎన్నోరకాల విమర్శలు ఎదుర్కొంటున్నారు. సినిమారంగం వారికి రాజకీయాలు ఎందుకని అంటూన్నా సినిమావారికి రాజకీయాలు అచ్చిరావని అనేకమంది పెదవివిరిచినా, ఎంతమంది నిరుత్సాహపరిచినా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఎక్కడా తగ్గలేదు. తానే స్వయంగా అత్తారింటికి దారేది సినిమాలో అన్నట్టు “ఎక్కడ తగ్గాలో తెలియాలి” అనే మాటని ఆయన పాటించారు. ఈ ఏడేళ్లలో అనేక ఆటుపోట్లను ఎదుర్శొన్నారు. ఎక్కడ తగ్గాలో తగ్గుతున్నాడు. ఎక్కడ స్పందించాలో అక్కడ మాట్లాడుతున్నారు. ఇదంతా ప్రజల కోసమే. ప్రస్తుతం ఒక్కసారి వర్తమానంలోకి వస్తే అందరిచూప్తు మళ్ళీ పవన్‌వైపే మళ్ళింది. మొన్నటి దాకా పవన్ ప్రసంగాలను దూరంగా ఉండి పరిశీలించిన అనేకమంది రాజకీయ విశ్లేషకులు ప్రస్తుతం పవన్‌లో ఖచ్చితంగా సమాజానికి పనికివచ్చే ధీటైన ప్రసంగాలు, నాయకుడి లక్షణాలు ఉన్నాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలుపుతూ.. ఇలాంటి ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటుంది tv9..
Also Read: