Trisha Marriage: త్రిష పెళ్లి పీటలెక్కడానికి సిద్ధమవుతోందా.. దానికి ఇదే నిదర్శనమా.. అసలు విషయమేంటంటే.!

Trisha Marriage: 1999లో వచ్చిన 'జోడి' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది అందాల తార త్రిష. 2003లో 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చెన్నై చిన్నది...

Trisha Marriage: త్రిష పెళ్లి పీటలెక్కడానికి సిద్ధమవుతోందా.. దానికి ఇదే నిదర్శనమా.. అసలు విషయమేంటంటే.!
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 02, 2021 | 7:51 AM

Trisha Marriage: 1999లో వచ్చిన ‘జోడి’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది అందాల తార త్రిష. 2003లో ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చెన్నై చిన్నది అనతికాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగుతో పాటు, తమిళంలో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ ఇండస్ట్రీ హిట్‌లను సొంతం చేసుకుంది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 22 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికే వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోందీ బ్యూటీ.

ఇదిలా ఉంటే 38 ఏళ్ల వయసులోనూ రవ్వంతైనా తగ్గని అందంతో ఆకట్టుకుంటోన్న త్రిష వివాహానికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట వైరల్‌ అవుతూనే ఉంది. త్రిషాకు గతంలో ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం అయిన విషయం తెలిసిందే.. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సల్‌ అయ్యింది. అప్పటి నుంచి అడపాదడపా త్రిష వివాహానికి సంబంధించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. కానీ ఆమె మాత్రం అధికారికంగా స్పందించలేదు.

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

ఇదిలా ఉంటే తాజాగా మరోసారి త్రిష పెళ్లి వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం త్రిష ‘పొన్నియిన్‌ సెల్వన్‌’, ‘చదురంగ వేట్టై-2’, ‘రాంగీ’, ‘గర్జనై’ చిత్రాలతో పాటు బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమాల తర్వాత త్రిష మరో కొత్త సినిమాకు సైన్‌ చేయలేదు. త్వరలో పెళ్లి పీటలెక్కే ఆలోచనలో ఉన్న కారణంగానే త్రిష కొత్త సినిమాలకు అంగీకరించడంలేదనేది వార్త సారంశం. త్రిష సన్నిహితులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారని కోలీవుడ్‌ మీడియాలో కోడై కూస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాంటే త్రిష స్పందించే వరకు వేడి చూడాల్సిందే.

Also Read: KYC : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కేవైసీ ఇంట్లోనే చేసుకోవచ్చు.. అదెలాగంటే..

India Rains: భారీ వర్షాలతో రాజధాని సహా ఉత్తర భారతం భీతావహం.. అసోంలో 7 లక్షల మంది నిరాశ్రయులు

Currency Note: ఈ ‘నెంబర్’ కలిగిన కరెన్సీ నోటు మీ వద్ద ఉందా? అయితే రూ. 3 లక్షలు మీ సోంతమైనట్లే..