Currency Note: ఈ ‘నెంబర్’ కలిగిన కరెన్సీ నోటు మీ వద్ద ఉందా? అయితే రూ. 3 లక్షలు మీ సోంతమైనట్లే..

Currency Note: చాలా మంది ప్రాచీన వస్తువులను సేకరించడం హాబీగా పెట్టుకుంటారు. ముఖ్యంగా నాణేలు, స్పెషల్ కరెన్సీ..

Currency Note: ఈ ‘నెంబర్’ కలిగిన కరెన్సీ నోటు మీ వద్ద ఉందా? అయితే రూ. 3 లక్షలు మీ సోంతమైనట్లే..
Notes

Currency Note: చాలా మంది ప్రాచీన వస్తువులను సేకరించడం హాబీగా పెట్టుకుంటారు. ముఖ్యంగా నాణేలు, స్పెషల్ కరెన్సీ నోట్లను సేకరించేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆసక్తి చూపుతుంటారు. వీరి ఆసక్తే.. మరికొందరిపాలిన అదృష్ట దేవతగా మారుతుంది. ప్రత్యేక నాణెలు, ప్రత్యేక కరెన్సీ నోట్లు ఉన్న వారిపై లక్ష్మీదేవి కనకవర్షం కురిపిస్తోంది.

మీ వద్ద పురాతన నాణెలు, నోట్లు ఉన్నట్లయితే మీరు లక్షాధికారులు అయిపోతారు. ఇంతకీ ఏ నాణెలు, ఏ నోట్లు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మందికి కొన్ని అదృష్ట సంఖ్యలు ఉంటాయి. కొందరికి 9 అంటే ఇష్టం. మరికొందరికి 8 అంటే ఇష్టం. ఇంకొందరు ఇతర నెంబర్లను ఇష్టపడుతారు. ఇలా 786 నెంబర్ కలిగిన నోట్లకు ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నెంబర్ కలిగిన నోట్ ఎవరివద్దనైనా ఉంటే.. వారు లక్షలు సొంతం చేసుకోవచ్చు. అవునండీ.. 786 సిరీస్ కలిగిన కరెన్సీ నోట్లు మీద ఉన్నట్లయితే.. రూ. 3 లక్షలు పొందే ఛాన్స్ ఉంది.

ఎలాంటి నోట్లు..?
5, 10, 20, 50, 100, 500 ఏ నోటు అయినా పర్వాలేదు. అయితే, ఆ నోటుపై 786 నెంబర్ సిరీస్ ఉండాలి. అలా ఉంటే మీరు లక్షాధికారి అవ్వొచ్చు. ఇలాంటి నోట్లను విక్రయించేందుకు అనేక వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి.

ఎందుకింత డిమాండ్? ఎక్కడ విక్రయించొచ్చు..
చాలామంది ప్రజలకు మతపరమైన, జ్యోతిష్యపరమైన విశ్వాసాలు ఉంటాయి. రంగు, సంఖ్య, ధరించే దుస్తులు, ఇలా ప్రతీది విశ్వాసం ప్రకారం చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది 786 సంఖ్యను కూడా చాలా మంది తమ అదృష్టంగా భావిస్తారు. అంతేకాదు.. దీనిని పవిత్రమైన సంఖ్యగా, శుభప్రదమైనదిగా పూజిస్తారు కూడా. అందుకే ఇలాంటి సిరీస్ కలిగిన నోట్లను వారు సురక్షితంగా ఉంచాలని భావిస్తుంటారు.

ఒకవేళ మీ వద్ద 786 సిరీస్ కలిగిన కరెన్సీ నోట్లు ఉన్నట్లయితే.. వాటిని ఈబే సైట్‌లో విక్రయించవచ్చు. ఈబే వెబ్‌సైట్‌లో 786 నెంబర్ కలిగిన 5, 10, 20, 50, 100, 200, 500, 2000 రూపాయల నోట్లను అమ్మవచ్చు. అయితే, ముందుగా ఆ నెంబర్ ఉన్న కరెన్సీ నోట్ ఫోటోను తీసి వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడి ధర ప్రకారం దానిని లిస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ వెబ్‌సైట్‌లో ఇంతకు ముందు 786 సిరీస్ నెంబర్ కలిగిన కరెన్సీ నోటు అక్షరాలా రూ. 3 లక్షలు బిడ్ చేయడం జరిగింది.

786 నోటు ఎలా విక్రయించాలి..
1. మీ వద్దనున్న నోటు ను విక్రయించడానికి మీరు మొదట www.ebay.com ని విజిట్ చేయాలి.
2. హోమ్‌పేజీలో కొత్త రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయాలి. మిమ్మల్ని మీరు విక్రేతగా నమోదు చేసుకోవాలి.
3. ఇప్పుడు మీరు ఏదైతే విక్రయించాలని భావిస్తున్నారో దానిని ఫోటో తీయండి. ఆ ఫోటోను వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేయండి.
4. ఆ తర్వాత పాత నాణేలు, నోట్లను కొనుగోలు చేయడానికి వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తున్న కొనుగోలుదారులకు ఈబే మీ ప్రకటనను నోటిఫై చేస్తుంది.
5. నోటు కొనడానికి ఆసక్తి ఉన్నవారు.. మిమ్మల్ని సంప్రదిస్తారు. అలా మీరు మీ నోట్లను విక్రయించవచ్చు.

మోసపోకండి..
ఇదిలాఉంటే.. పాత నాణేలు, నోట్ల విక్రయానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలను అప్రమత్తం చేసింది. వెబ్‌సైట్‌లో పురాతన నోట్లు, అరుదైన నాణేలకు సంబంధించి ఆన్‌లైన్ అమ్మకం రెండు పార్టీల మధ్య జరిగే చర్చలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇందులో ఆర్‌బిఐ పాత్ర లేదని, దీని ద్వారా జరిగే చీటింగ్‌ను నివారించడానికి ఆర్‌బిఐ అప్రమత్తంగా ఉంటుందని పేర్కొంది. చీటింగ్ పట్ల ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.

Also read:

Hyderabad: జలసౌధలో హాట్‌ హాట్‌గా సుధీర్ఘ సమావేశం.. ఫైనల్‌గా నీటి పంపకాలపై ఏం తేల్చారంటే..

Horoscope Today: ఈరాశుల వారికి ఉద్యోగాల్లో సమస్యలు.. ఖర్చులు అధికం.. ఈరోజు రాశిఫలాలు..

Pawan Kalyan Birthday: పవన్‌ కళ్యాణ్‌కు పవర్‌ స్టార్‌ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా.? ఆసక్తికరమైన విషయాలు మీకోసం.

Click on your DTH Provider to Add TV9 Telugu