Saindhav: సైంధవ్ మూవీ నుంచి మరో పోస్టర్.. పవర్ ఫుల్ రోల్‌లో హీరో ఆర్య

ఈ క్రమంలోనే తమిళ్ లో వచ్చిన విక్రమ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే రీసెంట్ గా వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ మూవీ కూడా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లోనూ అదే తరహా కథలను హీరోలు ఎంచుకుంటున్నారు. సీనియర్ హీరో వెంకటేష్ ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సైంధవ్ అనే హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు వెంకటేష్.

Saindhav: సైంధవ్ మూవీ నుంచి మరో పోస్టర్.. పవర్ ఫుల్ రోల్‌లో హీరో ఆర్య
Saindhav
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 31, 2023 | 8:38 AM

ఈ మధ్య యాక్షన్ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఇలాంటి కథలకు డిమాండ్ పెరగడంతో హీరోలంతా యాక్షన్ మూవీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళ్ లో వచ్చిన విక్రమ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే రీసెంట్ గా వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ మూవీ కూడా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లోనూ అదే తరహా కథలను హీరోలు ఎంచుకుంటున్నారు. సీనియర్ హీరో వెంకటేష్ ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సైంధవ్ అనే హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు వెంకటేష్.

సైంధవ్ సినిమాను శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చాలా మంది కీలక పాత్రల్లో నటించనున్నారని తెలుస్తోంది. వెంకటేష్ కెరీర్ లో ఈ సినిమా 75వ మూవీగా రానుంది. ఈ సినిమాలో రుహాని శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో ఎనిమిది మంది స్టార్స్ నటిస్తున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ఏడుగురిని పరిచయం చేశారు మేకర్స్. తాజాగా ఎనిమిదో పాత్రను కూడా పరిచయం చేశారు. ఈ సినిమా తమిళ్ స్టార్ హీరో ఆర్య కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆయనకు సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఆర్య లుక్ టెరిఫిక్ గా ఉంది. చేతిలో మెషిన్ గన్‌తో ఆర్య లుక్ అదిరిపోయింది. ఈ సినిమాలో ఆర్య పోలీస్ ఆఫ్రీసర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో మిగిలిన పాత్రల్లో నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరేమియా, సారా, జయప్రకాష్ నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.