OMG 2: సెన్సార్ కట్ లేకుండా ఓమైగాడ్ 2 చూడాలంటుంటూ టీమ్.. ఎందుకో తెలుసా..!
అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ఓ మై గాడ్ 2. సెక్స్ ఎడ్యూకేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కొన్ని సన్నివేశాలు తొలగించటంతో పాటు ఏ సర్టిఫికేట్ జారీ చేయటంతో మేజర్ సెక్షన్ ఆడియన్స్‌ను రీచ్ అవ్వలేకపోయింది. అయితే థియేట్రికల్ రిలీజ్ విషయంలో ఆడియన్స్ మిస్ అయిన ఎలిమెంట్స్‌ను ఓటీటీలో చూపించేందుకు రెడీ అవుతున్నారు ఓ మై గాడ్ 2 మేకర్స్.
చాలా కాలం తరువాత ఓ మై గాడ్ 2 సినిమాలో సూపర్ హిట్ అందుకున్నారు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్. ఈ సినిమా భారీ వసూళ్లు సాధించినా, మేకర్స్ ఏదో వెలితిగానే ఫీల్ అవుతున్నారు. ఇంతకీ మేకర్స్ ఫీలింగ్‌కు కారణమేంటి.. ఆ విషయంలో వాళ్ల నెక్ట్స్ స్టెప్పేంటి.? అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ఓ మై గాడ్ 2. సెక్స్ ఎడ్యూకేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కొన్ని సన్నివేశాలు తొలగించటంతో పాటు ఏ సర్టిఫికేట్ జారీ చేయటంతో మేజర్ సెక్షన్ ఆడియన్స్‌ను రీచ్ అవ్వలేకపోయింది. అయితే థియేట్రికల్ రిలీజ్ విషయంలో ఆడియన్స్ మిస్ అయిన ఎలిమెంట్స్‌ను ఓటీటీలో చూపించేందుకు రెడీ అవుతున్నారు ఓ మై గాడ్ 2 మేకర్స్.
అన్‌సెన్సార్డ్ వర్షన్‌ను డిజిటల్ ఆడియన్స్‌కు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. తాము చెప్పాలనుకున్న విషయం ప్రేక్షకులకు పర్ఫెక్ట్‌గా రీచ్ అవ్వాలంటే అన్‌సెన్సార్డ్ వర్షన్ చూడాలంటున్నారు ఓ మై గాడ్ 2 మేకర్స్. ఈ అప్‌డేట్‌తో ఈ మూవీ డిజిటల్ రిలీజ్ మీద కూడా భారీ హైప్ క్రియేట్ అవుతోంది.
View this post on Instagram
గతంలో ది కశ్మీర్ ఫైల్స్ సినిమాలో విషయంలోనూ చిత్ర యూనిట్ దాదాపు ఇలాంటి స్ట్రాటజీనే ఫాలో అయ్యింది. థియేట్రికల్ రిలీజ్‌లో మిస్ అయిన సీన్స్‌తో పాటు సినిమా కోసం చేసిన రిసెర్చ్, ఇంటర్వ్యూ వీడియోలను ది కశ్మీర్ ఫైల్స్ అన్ రిపోర్టెడ్ పేరుతో రిలీజ్ చేశారు.
View this post on Instagram
ఈ అప్‌డేట్ చూశాక ముందు ముందు చాలా సినిమాలు ఇదే ట్రెండ్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇప్పటికే పలు సినిమాలు ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు కూడా..
View this post on Instagram
ఓ మై గాడ్ సినిమా త్వరలో ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సినిమాను ఓటీటీలో చూడడానికి ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్స్ లో అదరగొట్టిన ఈ మూవీ. ఓటీటీలో ఎలా రాణిస్తుందో చూడాలి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.