Thalapathy 66 : దళపతి ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా.. వంశీ పైడిపల్లి సినిమలో విజయ్ ఇలా కనిపించనున్నాడట..
తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ రీసెంట్ గా బీస్ట్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళ్ లో విజయం సాధించినప్పటికీ తెలుగులో పర్లేదు అనిపించుకుంది.
తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్((Thalapathy vijay ) రీసెంట్ గా బీస్ట్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళ్ లో విజయం సాధించినప్పటికీ తెలుగులో పర్లేదు అనిపించుకుంది. ఈ సినిమా హిట్ టాక్ తెచుకున్నప్పటికీ అది దళపతి ఫ్యాన్స్ కు సరిపోలేదు. దాంతో ఇప్పుడు సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. విజయ్ ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్ సరసన లక్కీ బ్యూటీ రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.ఇటీవలే ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరుపుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించనుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా కోసం ఇప్పుడు మరో స్టేర్ హీరోయిన్ ఎంపిక చేశే పనిలో ఉన్నారట వంశీ. దాంతో ఈ సినిమాలో విజయ్ పాత్ర పెయిన్ ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని కోలీవుడ్ లో టాక్ బలంగా వినిపిస్తుంది. విజయ్ కు డ్యూయల్ రోల్ సినిమాలు కొత్తేమీ కాదు. విజయ్ ద్విపాత్రాభినయం చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. దాంతో ఇప్పుడు వంశీ పైడిపల్లి సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడం ఖాయం అంటున్నారు విజయ్ అభిమానులు. ఈ సినిమాను భారీఎత్తున తెలుగు తమిళ్ భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :