AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sekhar Movie Review: ఎమోషనల్‌గా… సాగిన ‘శేఖర్‌’ ఇన్వెస్టిగేషన్‌!

శేఖర్‌ (రాజశేఖర్‌) పోలీస్‌ కానిస్టేబుల్‌. ఒకానొక సందర్భంలో పోలీస్‌ ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. అదే సమయంలో అతని పర్సనల్‌ లైఫ్‌ కూడా డిస్టర్బ్ అవుతుంది.

Sekhar Movie Review: ఎమోషనల్‌గా... సాగిన 'శేఖర్‌' ఇన్వెస్టిగేషన్‌!
Shekar Movie Review
Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Janardhan Veluru|

Updated on: May 20, 2022 | 3:00 PM

Share

Sekhar Review: సినిమా ఇండస్ట్రీలో కొన్ని లెక్కలుంటాయి. చాలా వరకు ఆ లెక్కలు తప్పవు. నిజానికి కొందరు కొన్ని సినిమాలు చేస్తున్నారంటే… వాటి మీద బలమైన అంచనాలుంటాయి. అలాంటి లెక్కల్లో రాజశేఖర్‌ ఉంటారు. ఆయన చేసే సినిమాల మీద ఉన్న అంచనాలను చాలా సందర్భాల్లో రీచ్‌ అవుతుంటారు. ఇప్పుడు కూడా సేమ్‌ సిట్చువేషనే. శేఖర్‌ అలాంటి సినిమానే. రాజశేఖర్‌(Actor Rajasekhar) తాజాగా చేసిన రీమేక్‌ సినిమా శేఖర్‌. ఎలా ఉంది? రివ్యూలోకి వెళ్దాం.

సినిమా: శేఖర్‌ నటీనటులు: రాజశేఖర్‌, ఆత్మీయ రాజన్‌, ముస్కాన్‌, శివానీ రాజశేఖర్‌, సమీర్‌, కిశోర్‌, ప్రకాష్‌రాజ్‌, అభినవ్‌ గోమటం, తుమ్మల ప్రసన్నకుమార్‌, కవిత తదితరులు దర్శకత్వం: జీవితా రాజశేఖర్‌ నిర్మాత: బీరం సుధాకర రెడ్డి సమర్పణ: వంకాయలపాటి మురళీకృష్ణ మాటలు: లక్ష్మీభూపాల ఎడిటింగ్‌: గ్యారీ బీహెచ్‌ సంగీతం: అనూప్‌ రూబెన్స్ విడుదల: 20.05.2022

శేఖర్‌ (రాజశేఖర్‌) పోలీస్‌ కానిస్టేబుల్‌. ఒకానొక సందర్భంలో పోలీస్‌ ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. అదే సమయంలో అతని పర్సనల్‌ లైఫ్‌ కూడా డిస్టర్బ్ అవుతుంది. భార్యకు విడాకులిచ్చి కూతురు గీతని వెంట తెచ్చుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. అలా సాగుతున్న అతని జీవితంలో అనుకోని కుదుపులు ఏర్పడుతాయి. కూతురు కన్నుమూస్తుంది. భార్య డెత్ బెడ్‌ మీద ఉంటుంది. ఉన్నపళాన అలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? ఎలాంటి కేసునైనా అవలీలగా సాల్వ్ చేసే శేఖర్‌, అప్పటికప్పుడు తలకెత్తుకున్న అతి పెద్ద పని ఏంటి? అతని కూతురి మృతికి, భార్య మృతికి ఏమైనా లింకు ఉందా? ఉంటే దాన్ని శేఖర్‌ ఎలా కనుక్కున్నాడు? అతని లైఫ్‌ లో కిన్నెరకి ఉన్న స్థానం ఏంటి? శేఖర్‌తో ఉన్న నలుగురు ఫ్రెండ్స్ ఎవరు? వాళ్లు శేఖర్‌కి సపోర్ట్ చేశారా? మల్లికార్జున్‌ (కిశోర్‌) మీద శేఖర్‌కి ఏ విషయంలో అయినా అనుమానం ఉందా? మల్లికి, శేఖర్‌కి ఎలాంటి లింకులున్నాయి? అనేది ఆసక్తికరమైన కథ. ఈ కథ మొత్తం… అనూహ్యమైన అసలైన కథకు లీడ్‌ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

సొసైటీలో జరిగే కొన్ని విషయాలు భయం పుట్టిస్తాయి. అలాంటి భయం కలిగించే అంశాలతో తెరకెక్కించిన సినిమా శేఖర్‌. వైద్యో నారాయణో హరీ అని అంటారు. కానీ ఇప్పుడూ ఆ మాటను నమ్మేలా ఉందా సిట్చువేషన్‌? అనారోగ్యంతో హాస్పిటల్‌కి వెళ్తున్న వాళ్లు ఎంత వరకు సేఫ్‌? వైద్యం అందించాల్సిన ఆసుపత్రులు రోగుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాయి? మెడికల్‌ మాఫియా చీకటి కోణాల సంగతులేంటి? ప్రాణాలను కాపాడాల్సిన వారే తోడేస్తుంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయి? డబ్బు కోసం డాక్టర్లు ఎలాంటి పాపాలకు ఒడిగడుతున్నారు? వంటి విషయాలను స్పష్టంగా, సవివరంగా చెప్పిన కథ శేఖర్‌. మలయాళంలో విడుదలైన జోసెఫ్‌ అక్కడి ప్రేక్షకులను అలరించింది. దాన్నే తెలుగులో జీవిత… సినిమాగా చేస్తున్నారన్నప్పుడు, ఆల్రెడీ తెలిసిన కథను చెప్పడానికి ఏముంది? అనే మాటలు వినిపించాయి. తెలిసిన కథే అయినా, సొసైటీకి మరోసారి తెలియజేయాల్సిన కథ అనే తెగువతో తెరకెక్కించారు జీవిత రాజశేఖర్‌. రాజశేఖర్‌ సాల్ట్ అండ్‌ పెప్పర్‌ లుక్‌ బావుంది. తండ్రీ కూతుళ్లుగా రాజశేఖర్‌, శివానీ మెప్పించారు. హీరోయిన్లు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఫస్టాఫ్‌ కాస్త నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు అసలేం జరుగుతుందో అర్థం కానట్టు ఉంటుంది. అయితే… అదే సెకండాఫ్‌లో కథ మీద క్యూరియాసిటీ పెంచింది. సెకండాఫ్‌లో అసలు కథ, నెరేషన్‌ మెప్పిస్తుంది. చిన్న ఇన్సిడెంట్లను చెప్పి, వాటిని సాల్వ్ చేసే తీరు, క్రిమినల్స్ ఆలోచనా విధానం, అమాయకులు బలైపోతున్న వైనం… ఇలాంటి అంశాలను చక్కగా డీల్‌ చేశారు జీవిత.

Shekar Movie

Shekar Movie

మలయాళంతో పోలిస్తే తెలుగులో కథనంలో స్పీడ్‌ కనిపిస్తుంది. ఎమోషన్స్ బాగా పండాయి. రాజశేఖర్‌ చెప్పే ‘అక్కడ కృష్ణుడిని నేనే… ఇక్క భీష్ముడిని’ నేనే డైలాగ్‌ బావుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో ప్రకాష్‌రాజ్‌ కేరక్టర్‌ చెప్పే ప్రతి మాటలోనూ స్పష్టత కనిపిస్తుంది. ఆ సినిమా మొత్తాన్ని వివరించే ఆ సన్నివేశాల్లో సంభాషణలు కీలకం. ఏవో పదాలతో మెరుపులు అవసరం లేదు. కానీ, ఖంగాళీ కాకుండా ఉన్న విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన సందర్భం అది. దాన్ని లక్ష్మీభూపాల చక్కగా డీల్‌ చేశారు. అందరికీ అర్థమయ్యే రీతిలో డైలాగులు రాశారు.

ఫ్రెండ్స్ కారులో పాడుకునే పాట, తల్లీకూతుళ్లకు అంతిమ సంస్కారం చేసే సందర్భంలో వచ్చే పాట, రాజశేఖర్‌ కోలుకునే పాట సందర్భానుసారంగా ఉన్నాయి. సెకండాఫ్‌లో సినిమా కథ స్ట్రాంగ్‌గా కన్వే కావాలంటే ఫస్టాఫ్లో అంత బిల్డప్‌ తప్పదు. మలయాళ జోసెఫ్‌ సోల్‌ని తెలుగువారికి పరిచయం చేసిన సినిమా శేఖర్‌.

– డా. చల్లా భాగ్యలక్ష్మి

మరిన్ని సినిమా వార్తలు ఇక్కడ చదవండి..