Garuda Vega Producer: జీవిత మాట్లాడేదంతా సింపతీ కోసమే.. మా దగ్గర ఆధారాలున్నాయంటున్న గరుడ వేగ నిర్మాత

ప్రస్తుతం జీవితరాజశేఖర్, గరుడవేగ సినిమా నిర్మాత కోటేశ్వర రాజు, హేమ ల మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా జీవిత తీరుపై మండిపడ్డారు. జీవితా రాజశేఖర్ నాలుకలో నరం లేకుండా మాట్లాడుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Garuda Vega Producer: జీవిత మాట్లాడేదంతా సింపతీ కోసమే.. మా దగ్గర ఆధారాలున్నాయంటున్న గరుడ వేగ నిర్మాత
Garuda Vega Producer
Follow us

|

Updated on: May 20, 2022 | 1:24 PM

Garuda Vega Producer: గరుడ వేగ సినిమా వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా గరుడవేగ ప్రొడ్యూసర్ కోటేశ్వరరాజు, జోస్టర్ ఎంటర్ ప్రైజర్స్ ఎండీ హేమ  మీడియా సమావేశంలో జీవిత,రాజశేఖర్ దంపతులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవితా రాజశేఖర్ ఆరోపణలపై  మీడియా వేదికగా స్పందించారు. జీవితా రాజశేఖర్ సైలెంట్ కిల్లర్ అంటూ  జోస్టర్ ఎంటర్ ప్రైజర్స్ ఎండీ హేమ సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల జీవిత, రాజశేఖర్ చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. ప్రజలను అబద్దాలతో మోసం చేస్తున్నారని ఆరోపించారు. మాకు పరువు, ప్రతిష్ట, స్థోమత అర్హతలు ఉన్నాయి. మా ఆయన కోటేశ్వరరాజు యూఎస్ లో అవార్డు గ్రహీత. నేను యూకేలో హైలీ పెయిడ్ ప్రోఫెసర్ ని చెప్పారు. అయినా జీవితా రాజశేఖర్ కోర్టు కేసుతో బయపడినట్లు ఉన్నారని వ్యాఖ్యానించారు. తన దగ్గర జీవితా రాజశేఖర్ అప్పు తీసుకుందా లేదా చెప్పాలని .. అప్పు కోసం ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టారా లేదా చెప్పాలని హేమ డిమాండ్ చేశారు.

మరోవైపు గరుడవేగ ప్రొడ్యూసర్ కోటేశ్వరరాజు కూడా జీవితరాజశేఖర్ పై మండిపడ్డారు. తాము ఆధారాలతో మాట్లాడుతున్నామని .. అయితే జీవితా రాజశేఖర్ నాలుకలో నరం లేకుండా మాట్లాడుతోందంటూ వ్యాఖ్యానించారు. గరుడవేగ సినిమా విడుదలైన వెంటనే ఆమె డబ్బులు చెల్లించలేకపోయారు. దీంతో రాజశేఖర్ తండ్రి సమక్షంలో ఆస్తి పత్రాలు తాకట్టుపెట్టుకుని అగ్రిమెంట్ చేసుకున్నామని తెలిపారు.

జీవితా రాజశేఖర్ 420 వేషాల గురించే మేము మాట్లాడుతున్నామని.. అయితే వారు ప్రొడ్యూసర్లందరినీ అవమానించే రీతిలో మాట్లాడుతున్నారని కోటేశ్వరరాజు అన్నారు. సింపతీ కోసం జీవితా ఏదేదో మాట్లాడుతున్నారు.. మా బాధ గురించి మీడియా ముందుకు వస్తే పబ్లిసిటీ కోసం వచ్చామని జీవితా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు మాకు డబ్బులు ఇవ్వమని..  ఏమి చేస్తారో చేసుకోండని జీవితా మమ్మల్ని బెదిరించిందంటూ కోటేశ్వరరాజు సంచలనం కామెంట్స్ చేశారు. జీవితా సినిమాల్లో నటిస్తే బాగుంటుంది.. నిజ జీవితంలో కాదంటూ గరుడవేగ ప్రొడ్యూసర్ కోటేశ్వరరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..