AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanjjanaa Galrani: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌.. ఫ్యాన్స్ అభినందనల వెల్లువ..

Sanjjanaa Galrani: సంజన సోదరి నిక్కీ గల్రాణి ఇటీవల ఆదిపినిశెట్టితో కలిసి పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్‌ అక్కాచెల్లెళ్లిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Sanjjanaa Galrani: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌.. ఫ్యాన్స్ అభినందనల వెల్లువ..
Sanjjanaa Galrani
Basha Shek
|

Updated on: May 20, 2022 | 9:21 AM

Share

Sanjjanaa Galrani: ప్రముఖ కన్నడ నటి, బుజ్జిగాడు ఫేం సంజనా గల్రాని తల్లిగా ప్రమోషన్‌ పొందింది. తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమెకు వైద్యం అందించిన మహిళా డాక్టర్‌ సోషల్‌ మీడియాలో తెలిపింది. ‘బాబు పుట్టాడు, కంగ్రాచ్యులేషన్స్‌’ అన్న క్యాప్షన్‌ను జోడిస్తూ సంజనతో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది. ఇదిలా ఉంటే సంజన సోదరి నిక్కీ గల్రాణి ఇటీవల ఆదిపినిశెట్టితో కలిసి పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్‌ అక్కాచెల్లెళ్లిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

బుజ్జిగాడుతో గుర్తింపు..

ఇవి కూడా చదవండి

ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో త్రిషతో పాటు నటించిన మరో హీరోయిన్ సంజనా గల్రాని. ఆ సినిమాలో వచ్చిరానీ తెలుగు భాష మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుందీ ముద్దుగుమ్మ. ఈ సినిమా తర్వాత సత్యమేవ జయతే, దుశ్శాసన, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించింది. కోలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించిన ఈ కన్నడ ముద్దుగుమ్మ గతేడాది కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకుంది. శాండల్ వుడ్ పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో అరెస్టై, మూడు నెలల పాటు జైలు జీవితం అనుభవించింది. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చింది. జైలు నుంచి విడుదలైన వెంటనే ఆమె అజీజ్‌ బాషా అనే వ్యక్తితో పెళ్లిపీటలెక్కింది. ఆపై ఆమె కూడా ఇస్లాం మతాన్ని స్వీకరించింది. కాగా కొన్ని నెలల క్రితం తల్లికానున్నట్లు ప్రకటించిన ఈ ముద్దుగుమ్మ ఘనంగా బేబీ షవర్‌ వేడుకలు జరుపుకొంది. తాజాగా పండంటి మగబిడ్డను తమ కుటుంబంలోకి ఆహ్వానించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Ramcharan: స్పీడ్‌ పెంచిన మెగా పవర్‌స్టార్‌.. మరో టాప్‌ డైరెక్టర్‌కు గ్రీన్‌సిగ్నల్‌!

Jr NTR Birthday: కన్నడిగుల మనసుల్లో తారక్‌కు ప్రత్యేక స్థానం.. ఎందుకో తెలుసా?

Satyadev’s Godse: సత్యదేవ్‌ గాడ్సే విడుదలకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..