AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Satyadev’s Godse: సత్యదేవ్‌ గాడ్సే విడుదలకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..

Satyadev's Godse: ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను మొదట మే 20న విడుదల చేయాలనుకున్నారు. అయితే కొన్ని కారణాలతో అది సాధ్యం కాలేదు. తాజాగా కొత్త రిలీజ్‌ డేట్‌తో అధికారిక పోస్టర్‌ను విడుదల చేశారు మూవీ మేకర్స్‌.

Satyadev's Godse: సత్యదేవ్‌ గాడ్సే విడుదలకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..
Satyadev Godse
Basha Shek
|

Updated on: May 20, 2022 | 8:49 AM

Share

Satyadev’s Godse: వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు హీరో సత్యదేవ్‌(Satyadev). కెరీర్ ప్రారంభంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఇప్పుడు హీరోగా అదరగొడుతున్నాడు. ప్రస్తుతం అతని చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అందులో గాడ్సే (Godse) కూడా ఒకటి. గతంలో సత్యదేవ్‌తోనే బ్లఫ్‌ మాస్టర్ వంటి సూపర్‌ హిట్ సినిమాను రూపొందించిన గోపి గణేష్ ఈ సినిమాకు దర్శకుడు. సి. కల్యాణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అవినీతిమ‌య‌మైన రాజ‌కీయ నాయ‌కుల‌ను, వ్యవస్థను ఒంటి చేత్తో ఎదుర్కొనే ధైర్యవంతుడైన యువ‌కుడిగా సత్యదేవ్‌ క‌నిపించ‌నున్నారు. ఐశ్వర్య ల‌క్ష్మి ఇందులో ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్‌గా నటిస్తోంది. కాగా ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను మొదట మే 20న విడుదల చేయాలనుకున్నారు. అయితే కొన్ని కారణాలతో అది సాధ్యం కాలేదు. తాజాగా కొత్త రిలీజ్‌ డేట్‌తో అధికారిక పోస్టర్‌ను విడుదల చేశారు మూవీ మేకర్స్‌. ‘డేట్‌ ఒక్కటే మారిపోయింది. మిగతా అంతా సేమ్‌’ అంటూ రిలీజ్‌ చేసిన ఈ పోస్టర్‌లో సత్యదేవ్‌ లుక్‌ ఆకట్టుకునేలా ఉంది.

కాగా గాడ్సే సినిమాను డైరెక్ట్ చేయ‌డంతో పాటు క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌ల‌ను కూడా అందిస్తున్నారు గోపి గ‌ణేష్. ఇప్పటికే రిలీజైన టీజర్‌ సినిమా అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, సిజ్జూమీనన్‌, మాథ్యూ వర్గీస్‌, పృథ్వీ రాజ్‌, ప్రియదర్శి, చైతన్య కృష్ణ తదితరులు నటిస్తున్నారు. సునీల్‌ కశ్యప్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా గాడ్స్‌ తో పాటు గుర్తుందా శీతాకాలం, రామ్‌ సేతు (హిందీ), గాడ్‌ఫాదర్‌ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు సత్యదేవ్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Imran Khan: విడిపోయేందుకు సిద్ధమైన మరో బాలీవుడ్ జంట.. మామ ఆమిర్‌ ఖాన్ బాటలోనే అల్లుడు కూడా..

VIral Photo: చిన్నతనంలోనే నటనలో ఓనమాలు.. టాలీవుడ్‌ ఇండస్ట్రీ రికార్డులు తిరగేస్తోన్న ఈ బుడతడిని గుర్తుపట్టారా?

IPL 2022: ఒంటిచేత్తో అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు.. కోల్‌కతాకు గుండెకోత మిగిల్చాడు..