- Telugu News Photo Gallery Jr Ntr birthday: Do you know Jr NTR has special love for Kannada language..
Jr NTR Birthday: కన్నడిగుల మనసుల్లో తారక్‌కు ప్రత్యేక స్థానం.. ఎందుకో తెలుసా?
Happy Birthday Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ సౌత్ ఇండియాలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. అతనికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈరోజు (మే 20) పుట్టినరోజు జరుపుకుంటున్న ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కన్నడిగులు కూడా ఈ మాస్ హీరోకు శుభాకాంక్షలు తెలిపారు
Updated on: May 20, 2022 | 8:25 AM

జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని. ఆమె స్వస్థలం కర్ణాటక ఉడిపి జిల్లాలోని కుందాపూర్. అందుకే తారక్ అనర్గళంగా కన్నడ మాట్లాడతాడు. అతనేకాదు వాళ్లింట్లో చాలామందికి కన్నడ అర్థమవుతుంది. ఇక RRR సినిమా కన్నడ వెర్షన్‌కి ఎన్టీఆర్ తనే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.

తారక్ తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. టాలీవుడ్‌లో బిజీగా ఉన్నప్పటికీ కన్నడ అంటే ఆయనకు ప్రత్యేక గౌరవం. అందుకే కన్నడ సినీ ప్రియులకు ఎన్టీఆర్ అంటే అభిమానం.

జూనియర్ ఎన్టీఆర్ చాలా వేదికల్లో కూడా కన్నడలోనే సంభాషించాడు. కన్నడ మీడియా అడిగే ప్రశ్నలకు కూడా కన్నడలోనే సమాధానమిస్తాడు. అందుకే ఎన్టీఆర్ అంటే కన్నడ అభిమానులు ప్రత్యేక అభిమానం చూపిస్తారు.

జూనియర్ ఎన్టీఆర్ సౌత్ ఇండియాలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. అతనికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈరోజు (మే 20) పుట్టినరోజు జరుపుకుంటున్న ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కన్నడిగులు కూడా ఈ మాస్ హీరోకు శుభాకాంక్షలు తెలిపారు.

&RRR సినిమా సూపర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆయన తదుపరి సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శితో పాటు ప్రశాంత్ నీల్ తో సినిమాలు చేస్తున్నాడు. వీటికి సంబంధించిన అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.

Happy Birthday Jr NTR




