AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramcharan: స్పీడ్‌ పెంచిన మెగా పవర్‌స్టార్‌.. మరో టాప్‌ డైరెక్టర్‌కు గ్రీన్‌సిగ్నల్‌!

Ramcharan: ప్రస్తుతం ఫుల్‌ ఫామ్‌లో ఉన్న రామ్‌చరణ్‌తో సినిమాలు చేయడానికి పలువురు స్టార్‌ డైరెక్టర్లు క్యూలో ఉన్నారు. ఈక్రమంలోనే కోలీవుడ్‌కు చెందిన ఓ టాప్‌ డైరెక్టర్‌తో కూడా మెగా పవర్‌స్టార్‌ సినిమా చేయనున్నట్లు సమాచారం.

Ramcharan: స్పీడ్‌ పెంచిన మెగా పవర్‌స్టార్‌.. మరో టాప్‌ డైరెక్టర్‌కు గ్రీన్‌సిగ్నల్‌!
Ram Charan
Basha Shek
|

Updated on: May 20, 2022 | 9:14 AM

Share

Ramcharan: మెగా‌పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ramcharan) ఇప్పుడు మంచి జోష్‌ మీద ఉన్నాడు. ఇటీవల విడుదలైన ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్రంతో పాన్‌ఇండియా స్టార్‌గా మారిన ఈ హీరో ప్రస్తుతం సౌతిండియన్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్ (Shankar) తో ఒక సినిమాను చేస్తున్నాడు. RC15 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పటికే పలు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. ఇటీవల విడుదలైన కొన్ని స్టిల్స్‌ చూస్తుంటే ఇది పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోందని తెలుస్తోంది. ఇక దీని తర్వాత చెర్రీతో సినిమా చేయడానికి జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సిద్ధంగా ఉన్నాడు. ఇదికూడా పాన్‌ ఇండియ స్థాయిలోనే తెరకెక్కిస్తామని గౌతమ్‌ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం ఫుల్‌ ఫామ్‌లో ఉన్న రామ్‌చరణ్‌తో సినిమాలు చేయడానికి పలువురు స్టార్‌ డైరెక్టర్లు క్యూలో ఉన్నారు. ఈక్రమంలోనే కోలీవుడ్‌కు చెందిన ఓ టాప్‌ డైరెక్టర్‌తో కూడా మెగా పవర్‌స్టార్‌ సినిమా చేయనున్నట్లు సమాచారం.

అతను మరెవరో కాదు ఖైదీ, మాస్టర్ చిత్రాలతో వరుస హిట్స్‌ అందుకున్న లోకేష్ కనగరాజ్ . ప్రస్తుతం అతను కమల్‌హాసన్‌తో విక్రమ్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 3న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత లోకేష్ రజనీకాంత్, అజిత్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే లోకేష్ .. ఇటీవల రామ్‌చరణ్ కు ఒక కథ వినిపించాడని తెలుస్తోంది. దీనికి చెర్రీ కూడా బాగా ఇంప్రెస్ అయినట్లు అతనితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్‌ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం చరణ్‌ బోలెడన్ని కమిట్‌‌మెంట్స్ ఉండడంతో లోకేష్ తో సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read:

Jr NTR Birthday: కన్నడిగుల మనసుల్లో తారక్‌కు ప్రత్యేక స్థానం.. ఎందుకో తెలుసా?

Satyadev’s Godse: సత్యదేవ్‌ గాడ్సే విడుదలకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..

Imran Khan: విడిపోయేందుకు సిద్ధమైన మరో బాలీవుడ్ జంట.. మామ ఆమిర్‌ ఖాన్ బాటలోనే అల్లుడు కూడా..