NTR 31: ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్‌ ట్రీట్‌ వచ్చేసింది.. ఊరమాస్‌ లుక్‌లో అదరగొట్టిన తారక్‌..

Jr NTR Birthday: తాజాగా ఎన్టీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని NTR 31 సినిమాలో తారక్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. భారీ యాక్షన్‌ డ్రామాతో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ఊరమాస్‌లుక్‌లో అదరగొట్టేశాడు.

NTR 31: ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్‌ ట్రీట్‌ వచ్చేసింది.. ఊరమాస్‌ లుక్‌లో అదరగొట్టిన తారక్‌..
Jrntr
Follow us
Basha Shek

|

Updated on: May 20, 2022 | 12:52 PM

Jr NTR Birthday: టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్‌ ఎన్టీఆర్ (JRNTR) నేడు పుట్టిన రోజు జరుపుకోనుననాడు.ఈ క్రమంలో ఈయన కొత్త సినిమాల అప్డేట్ లు వరుసగా వస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్‌ 30 సినిమా అప్డేట్‌ రాగా.. తాజాగా 31వ సినిమా గురించి మరో బిగ్‌ అప్డేట్‌ కూడా వచ్చేసింది. కేజీఎఫ్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రతిష్ఠాత్మక మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. తాజాగా ఎన్టీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని NTR 31 సినిమాలో తారక్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. భారీ యాక్షన్‌ డ్రామాతో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ఊరమాస్‌లుక్‌లో అదరగొట్టేశాడు. ‘రక్తంతో తడిచిన నేల మాత్రమే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే ఆయన నేల.. ఆయన వారసత్వం మాత్రమే గుర్తుంటాయి. అతని రక్తం కాదు’ అంటూ దీనికి క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ లుక్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. నందమూరి అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

కాగా ఈ సినిమాకు ముందే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో జనతాగ్యారేజ్‌ లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి నిన్నే ఓ క్రేజీ అప్డేట్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఆ వీడియోలో ఎన్టీఆర్ వర్షంలో నిలబడి రక్తంతో తడిసిన కత్తి పట్టుకుని ‘అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు.. అవసరానికి మించి తాను ఉండకూడదని.. అప్పుడు భయానికి కూడా తెలియాలి. తను రావాల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా”. అంటూ డైలాగ్‏తో అదరగొట్టాడు ఎన్టీఆర్. ఇది కూడా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఈ రెండు సినిమాల అప్డేట్‌లను చూస్తుంటే ఎన్టీఆర్‌ మరోసారి తనలోని మాస్‌ యాంగిల్స్‌ను ప్రేక్షకులకు చూపించేందుకు సిద్ధమయ్యాడని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి..

Also Read:

TS Police Jobs 2022: ఉద్యోగార్థులకు అలెర్ట్‌.. పోలీస్‌ జాబ్స్‌ దరఖాస్తులకు మరికొన్ని గంటల్లో ముగియనున్న గడువు..

Ramcharan: స్పీడ్‌ పెంచిన మెగా పవర్‌స్టార్‌.. మరో టాప్‌ డైరెక్టర్‌కు గ్రీన్‌సిగ్నల్‌!

Jr NTR Birthday: కన్నడిగుల మనసుల్లో తారక్‌కు ప్రత్యేక స్థానం.. ఎందుకో తెలుసా?