Viral Photo: తారక్‌ను ప్రేమతో హత్తుకున్న ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టగలరా..?

నేడు చిన్న రామారావు బర్త్ డే. దీంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తు సెలబ్రేషన్స్ చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలో పోస్ట్‌లతో హెరెత్తిస్తున్నారు.

Viral Photo: తారక్‌ను ప్రేమతో హత్తుకున్న ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టగలరా..?
Tarak Birthday
Follow us
Ram Naramaneni

|

Updated on: May 20, 2022 | 12:24 PM

Happy Birthday NTR: జూనియర్ NT రామారావు … తెలుగు జాతి గర్వించదగ్గ నటుడు. భారతదేశంలో వన్ ఆఫ్‌ ద ఫైనెస్ట్ యాక్టర్. డ్యాన్స్ వేయాలన్నా. డైలాగ్ చెప్పాలన్నా.. ఏ భావాన్నైనా సరే పలికించాలన్నా..  తనకు తనే సాటి. తాత, తండ్రి నుంచి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న చిన్న రామారావు.. లెగసీని ముందుకు తీసుకెళ్తున్నారు. సాధారణ జనం మాత్రమే కాదు.. ఎందరో సెలబ్రిటీలు కూడా అతని ఫ్యాన్స్ అయిపోయారు.  1983 మే 20న జన్మించారు జూనియర్​ ఎన్టీఆర్​.  1997లో గుణశేఖర్(Gunasekhar) తెరకెక్కించిన బాలరామాయణం(Bala Ramayanam) సినిమాలో రాముడి పాత్రలో నటించారు. 2001లో ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అంచెలంచెలుగా తెలుగులో స్టార్ హీరోగా ఎదిగారు. ‘ఆర్​ఆర్​ఆర్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు  నేడు(మే 20) ఎన్టీఆర్ బర్త్ డే.  దీంతో ఆయన ఫ్యాన్స్  పండగ చేసుకుంటున్నారు. అన్నదానం చేస్తున్నారు. రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేశారు. మరోవైపు ట్విట్టర్, ఇన్ స్టా‌లలో పోస్ట్‌లతో మోత మోగిస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు పలువురు సెలబ్రిటీలు సైతం ఆయన విషెస్ చెబుతున్నారు.  పైన ఫోటోలో తారక్‌ని ప్రేమతో కౌగిలించుకున్న వ్యక్తి ఎవరో గుర్తించారా..? గుర్తిస్తే ఓకే.. లేదంటే మేమే చెప్పేస్తాం. హీ ఈజ్ నన్ అదర్ దెన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. చరణ్, తారక్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఇటీవలే RRR సినిమాలో కూడా నటించారు. దీంతో వీరి మధ్య బాండింగ్ మరింత పెరిగింది. తాజాగా తారక్ బర్త్ డే సందర్భంగా.. చరణ్ భావోద్వేగ పోస్ట్ పెట్టారు.

“బ్రదర్, కో స్టార్, ఫ్రెండ్ … నువ్వు నాకు ఏంటో నిర్వచించడానికి పదాలు సరిపోవు.. తారక్ ! నీతో కలిసి గడిపిన మూమెంట్స్ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. పుట్టినరోజు శుభాకాంక్షలు !” అని పేర్కొన్న చరణ్ ఓ అందమైన ఫోటోను పంచుకున్నారు. దీంతో మెగా, నందమూరి హీరోల మధ్య బాండింగ్ చూసి.. వారి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.