JR. NTR: తారక్ పుట్టినరోజు నేడు .. అర్ధరాత్రి ఎన్టీఆర్ ఇంటివద్ద హంగామా.. పోలీసులు లాఠీఛార్జ్

తమ అభిమాన హీరో బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ కు భారీగా జూనియర్ ఫ్యాన్స్ తరలివచ్చారు. అర్ధరాత్రి తారక్ ఇంటి వద్ద నానా హంగామా చేశారు. తారక్ ఇంటి ముందు కేక్ కట్ చేశారు. జై ఎన్టీఆర్‌ అంటూ నినాదాలు చేసిన అభిమానులు..

JR. NTR: తారక్ పుట్టినరోజు నేడు .. అర్ధరాత్రి ఎన్టీఆర్ ఇంటివద్ద హంగామా.. పోలీసులు లాఠీఛార్జ్
Jr Ntr Fans Hungama
Follow us
Surya Kala

|

Updated on: May 20, 2022 | 8:02 AM

JR. NTR Fans Hungama: టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో జూ. ఎన్టీఆర్ నేడు 39వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. తమ అభిమాన హీరో తారక్ పుట్టిన సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని(Jublihills) ఆయన ఇంటి దగ్గర అర్ధరాత్రి అభిమానుల అత్యుత్సాహం ప్రదర్శించారు. తమ అభిమాన హీరో బర్త్ డే  సందర్భంగా హైదరాబాద్ కు భారీగా జూనియర్ ఫ్యాన్స్ తరలివచ్చారు. అర్ధరాత్రి తారక్ ఇంటి వద్ద నానా హంగామా చేశారు. తారక్ ఇంటి ముందు కేక్ కట్ చేశారు. జై ఎన్టీఆర్‌ అంటూ నినాదాలు చేసిన అభిమానులు.. ఆయన ఇంటి నుంచి బయటకు రావాలని నినాదాలు చేశారు. డ్యాన్సులతో రచ్చ చేశారు. అర్ధరాత్రి కావడంతో  ఫ్యాన్స్ హంగామా, అల్లరితో  వాహనదారులు, స్థానికులు ఇబ్బంది పడ్డారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. ఎన్టీఆర్‌ అభిమానులను పంపించేందుకు యత్నించారు. అయినా అభిమానులు పోలీసుల మాటలను వినకపోవడంతో.. అభిమానులపై లాఠీచార్జ్‌ చేశారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమ లాఠీలకు పని చెప్పడంతో ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఇంటి వద్ద నుంచి వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్ టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..