AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalapathy 69: పెద్ద ప్లానే ఇది.! విజయ్ 69వ సినిమాతో ఆపేయడానికి కారణం ఇదేనట..!

దళపతి హీరోగా నటిస్తున్న చివరి సినిమా రీసెంట్ గానే ప్రకటించారు. విజయ్ కెరీర్‌లో ఇది 69వ చిత్రం. ఈ నేపథ్యంలో విజయ్ 70 పూర్తి కాకుండానే 69 సినిమాలతో తన నటజీవితాన్ని ఎందుకు ముగించుకుంటున్నాడనేది ఇప్పుడు విజయ్ అభిమానుల్లోని ప్రశ్న.

Thalapathy 69: పెద్ద ప్లానే ఇది.! విజయ్ 69వ సినిమాతో ఆపేయడానికి కారణం ఇదేనట..!
Vijay
Rajeev Rayala
|

Updated on: Sep 17, 2024 | 8:40 AM

Share

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ దళపతి విజయ్ తన సినీ కెరీర్‌కు కొంత విరామం ఇవ్వనున్నాడు.  రాజకీయాల్లోకి రావడానికి విజయ్ సిద్ధంగా ఉన్నాడు. దళపతి హీరోగా నటిస్తున్న చివరి సినిమా రీసెంట్ గానే ప్రకటించారు. విజయ్ కెరీర్‌లో ఇది 69వ చిత్రం. ఈ నేపథ్యంలో విజయ్ 70 పూర్తి కాకుండానే 69 సినిమాలతో తన నటజీవితాన్ని ఎందుకు ముగించుకుంటున్నాడనేది ఇప్పుడు విజయ్ అభిమానుల్లోని ప్రశ్న. అయితే ఇప్పుడు దీనిపై ఆసక్తికరమైన రూమర్స్ కోలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి : Tollywood : తండ్రికి 5 పెళ్లిళ్లు.. కూతురుకి 3 పెళ్లిళ్లు.. అమ్మబాబోయ్ ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

న్యూమరాలజీ ప్రకారం, 69 చాలా ప్రత్యేకమైన సంఖ్య. మీరు 69ని రెండుగా విడదీసినప్పుడు. 6, 9 సంఖ్యలు అవుతాయి . అందులో 6 ప్రేమ, సంరక్షణ అలాగే ఐక్యతను సూచిస్తుంది. ఇక 9 అధికారం, నాయకత్వాన్ని సూచిస్తుంది. అలాగే, న్యూమరాలజీ ప్రకారం 69 సంఖ్య ఏదైనా ముగించడానికి, కొత్తదాన్ని ప్రారంభించడానికి ఉత్తమమైనది అని అంటుంటారు. అలాగే 69 ప్రకారం మన జీవితంలో ఒక ముఖ్యమైన దశ ముగింపును సూచిస్తుంది. ఇది జీవితంలో కొత్త లక్ష్యాన్ని కనుగొని కొత్త మార్గాన్ని అనుసరించామని సూచిస్తుందట. దాంతో విజయ్ తన సినీ కెరీర్‌ను 69వ నంబర్‌తో ముగించుకుని రాజకీయాల్లోకి రావడానికి ఇదే కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి :దుమ్మురేపిన దేవుళ్ళు పాప..! అందాలు చూస్తే అదరహో అనాల్సిందే..!

అదే సమయంలో ‘దళపతి 69’ అనే టైటిల్‌తో విజయ్‌ నటిస్తున్న నయా సినిమా ఇటీవలే అనౌన్స్ చేశారు. ‘దళపతి 69’కి ‘తీరన్’, ‘తునీవ్’ వంటి చిత్రాల దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ‘ది టార్చ్‌బేరర్ ఆఫ్ డెమోక్రసీ’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తుంది. కాబట్టి ఈ సినిమా రాజకీయాల నేపథ్యంలో సాగుతుందని అంటున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకుర్చారు. ఈ ఏడాది షూటింగ్ ప్రారంభం కానున్న ‘దళపతి 69’ అక్టోబర్ 2025లో థియేటర్లలోకి రానుంది.

ఇది కూడా చదవండి: సినిమాల్లో బోల్డ్‌గా కనిపిస్తే.. పెద్ద హీరోలతో ఆ పని చేయాలా..? అసలు విషయం బయటపెట్టిన నటి

విజయ్ తాజా చిత్రం ‘గోట్ థియేటర్లలో మంచి వసూళ్లను రాబడుతోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల కలెక్షన్లను దాటేసింది.  ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమాలో త్రిష, శివకార్తికేయన్‌ల అతిధి పాత్రలు చేశారు. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, జయరామ్, మీనాక్షి చౌదరి, మోహన్, అజ్మల్ అమీర్, యోగి బాబు, వీటీవీ గణేష్, వైభవ్, ప్రేంగి, అరవింద్ , అజయ్ రాజ్ తదితరులు నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.