Leo Movie: ‘లియో’ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. అక్కడ విజయ్ సినిమా రిలీజ్ అయ్యేనా?
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ‘లియో’ చిత్రం అక్టోబర్ 19న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇది పాన్ ఇండియా సినిమా. తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఖైదీ, విక్రమ్ సినిమాలతో కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లోకేశ్ కనగరాజ్. ఇక విజయ్‌తో కలిసి మాస్టర్ అనే బ్లాక్ బస్టర్ సినిమాను కూడా తెరెకెక్కించారు. ఈ […]
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ‘లియో’ చిత్రం అక్టోబర్ 19న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇది పాన్ ఇండియా సినిమా. తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఖైదీ, విక్రమ్ సినిమాలతో కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లోకేశ్ కనగరాజ్. ఇక విజయ్‌తో కలిసి మాస్టర్ అనే బ్లాక్ బస్టర్ సినిమాను కూడా తెరెకెక్కించారు. ఈ నేపథ్యంలో విజయ్, లోకేశ్‌ల కాంబోలో రెండోసారి వస్తోన్న లియో సినిమాపై భారీ అంచానాలు ఉన్నాయి. కాగా కేవలం 10 నెలల్లోనే ‘లియో’ సినిమాని పూర్తి చేశాడు లోకేష్. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. ‘లియో’ సినిమా ట్రైలర్ అక్టోబర్ 5న విడుదల కానుంది. సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ఈ విషయాన్ని తెలిపారు మేకర్స్. అలాగే సినిమాకు సంబంధించి ఒక కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో మంచులో దళపతి విజయ్ హైనాతో పోరాడుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నామని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ‘లియో చిత్రాన్ని ‘సెవెన్ స్క్రీన్ స్టూడియో’ నిర్మించింది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
కాగా కావేరీ జలాల పంపిణీపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. ఇప్పట్లో ఇది సద్దుమణిగే సూచనలు కనిపించడం లేదు . దీనికి సంబంధించి కర్ణాటకలో నిరసనలు, బంద్‌లు జరుగుతున్నాయి. ఇటీవల బెంగుళూరు వచ్చిన తమిళ నటుడు సిద్ధార్థ్‌కు కూడా అవమానం ఎదురైంది. దీంతో ఆయన విలేకరుల సమావేశం సగంలోనే ఆగిపోయింది. కర్ణాటకలో తమిళ సినిమాలపై నిషేధం విధించే యోచనలో ఉంది . దీంతో ‘లియో’ సినిమాను కర్ణాటకలో బ్యాన్ చేస్తారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కాగా తమిళ సినిమాలకు కర్ణాటకలో భారీ మార్కెట్ ఉంది. ఇంతకుముందు విడుదలైన రజనీకాంత్ ‘జైలర్’ సినిమా కర్ణాటకలో భారీ వసూళ్లను రాబట్టింది. బెంగుళూరులో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే ‘లియో’ చిత్రానికి విపరీతమైన డిమాండ్ వచ్చేది. అయితే ఇప్పుడు చెలరేగిన నిరసనల కారణంగా సినిమా వెనక్కు తగ్గే అవకాశం ఉంది.
అక్టోబర్ 5న లియో ట్రైలర్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.