Thalapathy Vijay Leo: దళపతి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రమోషన్ విషయంలో కొత్త ప్లాన్‌తో టీమ్
కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ కూడా తన ఓల్డ్ స్టైల్‌ను వదిలి.. కొత్త ఫార్మాట్‌ను రెడీ చేశారు. వారిసు సినిమాతో మరో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న విజయ్.. ప్రజెంట్ లియో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

సినిమా మేకింగ్ టేకింగ్ విషయంలోనే కాదు ప్రమోషన్ విషయంలోనూ చాలా చేజెంస్ వస్తున్నాయి. అందుకే హీరోలు కూడా తమ స్ట్రాటజీస్ మార్చేస్తున్నారు. ఇన్నాళ్లు సినిమా ప్రమోషన్ విషయంలో ఫాలో అయిన ఫార్ములాలను ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నారు. కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ కూడా తన ఓల్డ్ స్టైల్‌ను వదిలి.. కొత్త ఫార్మాట్‌ను రెడీ చేశారు. వారిసు సినిమాతో మరో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న విజయ్.. ప్రజెంట్ లియో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. తనకు మాస్టర్ లాంటి డిఫరెంట్ హిట్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కశ్మీర్ షెడ్యూల్ ఈ మధ్యే పూర్తయ్యింది.
అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే ప్రమోషన్ విషయంలో కొత్త ప్లాన్‌తో ముందుకు వెళుతున్నారు మేకర్స్. గతంలో విజయ్ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను చాలా ఆలస్యంగా ఇచ్చేవారు. ముఖ్యంగా షూటింగ్ అంతా పూర్తయ్యే వరకు విజయ్ లుక్ రివీల్ అవ్వకుండా జాగ్రత్త పడేవారు. లియో విషయంలో మాత్రం ఒపెనింగ్ డే రోజే విజయ్ లుక్ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చారు. ఆ తరువాత కూడా వరుసగా లొకేషన్ ఫోటోస్ షేర్ చేస్తూ వస్తున్నారు. తాజాగా కశ్మీర్ షెడ్యూల్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది లియో టీమ్.
లేటెస్ట్ మేకింగ్ వీడియోలో విజయ్ లుక్‌తో పాటు కశ్మీర్ షెడ్యూల్‌కు సంబంధించిన లొకేషన్ విజువల్స్, సపోర్టింగ్ క్యారెక్టర్స్‌ను కూడా పరిచయం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయ్ సినిమా అప్‌డేట్స్ రిలీజ్‌కు ముందే వస్తుండటంతో ఫ్యాన్స్ పండుగ