Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈవారం థియేటర్/ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు.. అన్ని మనసులను కదిలించే చిన్న చిత్రాలే..

ఈ క్రమంలోనే ఇప్పుడు థియేటర్లలో చిన్న చిత్రాల హంగామా నడుస్తోంది. గతవారం అన్ని చిన్న సినిమాలే విడుదల కాగా.. ఈవారం సైతం తక్కువ బడ్జెట్ చిత్రాలే కాబోతున్నాయి. అలాగా ఓటీటీలోనూ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ మాత్రమే కాకుండా.. కామెడీ సిరీస్ సైతం అలరిస్తున్నాయి. మరీ జూన్ రెండో వారంలో రిలీజ్ కాబోతున్న సినిమాలు.. వెబ్ సిరీస్ ఎంటో తెలుసుకుందామా..

Tollywood: ఈవారం థియేటర్/ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు.. అన్ని మనసులను కదిలించే చిన్న చిత్రాలే..
Tollywood Movies
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 05, 2023 | 10:45 AM

బాక్సాఫీస్ వద్ద వారం వారం కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. ఇక ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‏తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుంటారు మేకర్స్. మరోవైపు పెద్ద సినిమాలు త్వరలోనే ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు థియేటర్లలో చిన్న చిత్రాల హంగామా నడుస్తోంది. గతవారం అన్ని చిన్న సినిమాలే విడుదల కాగా.. ఈవారం సైతం తక్కువ బడ్జెట్ చిత్రాలే కాబోతున్నాయి. అలాగా ఓటీటీలోనూ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ మాత్రమే కాకుండా.. కామెడీ సిరీస్ సైతం అలరిస్తున్నాయి. మరీ జూన్ రెండో వారంలో రిలీజ్ కాబోతున్న సినిమాలు.. వెబ్ సిరీస్ ఎంటో తెలుసుకుందామా..

టక్కర్.. చాలా కాలం తర్వాత హీరో సిద్ధార్థ్ నటించిన చిత్రం టక్కర్. ఇందులో దివ్యాంక కౌశిక్ కథానాయికగా నటిస్తోంది. డైరెక్టర్ కార్తీక్ జి.క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 9న తెలుగుతోపాటు.. తమిళ భాషల్లో ఒకసారి విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.

విమానం.. నటుడు సముద్రఖని, అనసూయ, మీరా జాస్మిన్, మాస్టర్ ధ్రువన్ కీలకపాత్రలో నటించిన చిత్రం విమానం. డైరెక్టర్ శివ ప్రసాద్ యానాల తెరకెక్కిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. విమానం ఎక్కడం ఇష్టమున్న కొడుకు కోరిక తీర్చడం కోసం ఓ తండ్రి పడే తపనే ఈ చిత్రం. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సినిమా జూన్ 9న ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

ఇవి కూడా చదవండి

అన్ స్టాపబుల్.. బిగ్ బాస్ ఫేమ్ వి.జె సన్నీ, సప్తగిరి హీరోలుగా నటించిన చిత్రం అన్ స్టాపబుల్. డైమండ్ రత్నబాబు తెరకెక్కించిన ఈ సినిమాలో నక్షత్ర, అక్సాఖాన్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా జూన్ 9న రిలీజ్ కాబోతుంది.

ఏనుగు కథ.. డైరెక్టర్ కె.ఎస్.నాయక్ దర్శకత్వంలో మాస్టర్ శశాంత్ నటించిన చిత్రం పోయే ఏనుగు పోయే. ఈ సినిమా జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈవారం ఓటీటీలోకి రాబోయే చిత్రాలు, వెబ్ సిరీస్.

నెట్ ఫ్లిక్స్.. బర్రకుడ క్వీన్స్.. జూన్ 5 ఆర్నాల్డ్ .. జూన్ 7 నెవర్ హావ్ ఐ ఎవర్.. జూన్ 8 టూర్ డి ఫ్రాన్స్.. జూన్ 8

అమెజాన్ ప్రైమ్.. మై ఫాల్ట్.. హాలీవుడ్.. జూన్ 8

జీ5.. ది ఐడల్.. జూన్ 5

డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. అవతార్.. ది వే ఆఫ్ వాటర్.. జూన్ 7 సెయింట్ ఎక్స్.. జూన్ 7 ఎంపైర్ ఆఫ్ లైట్.. జూన్ 9 ఫ్లామిన్ హాట్.. జూన్ 10

జియో సినిమా.. బ్లడ్ డాడీ.. జూన్ 9 యూపీ 65.. జూన్ 8

సోనీ లివ్.. 2018.. జూన్ 7