Rahul Sipligunj: మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు భారీ నజరానా.. ఎంతంటే?

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన గద్దర్‌ అవార్డుల ప్రదానోత్సవంలోనే రాహుల్‌ సిప్లిగంజ్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ హైదరాబాదీ సింగర్ కు అవార్డు ఇవ్వకపోయినా ఏదో ఒకటి ఇవ్వాలని సీఎం చెప్పగా.. దానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా తల ఊపారు

Rahul Sipligunj: మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు భారీ నజరానా.. ఎంతంటే?
Rahul Sipligunj, CM Revanth Reddy

Updated on: Jul 20, 2025 | 12:49 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు అందుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ హైదరాబాద్ పోరడికి తెలంగాణ సర్కార్ భారీ నజరానా ప్రకటించింది. బోనాల పండగను పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ కు రూ.కోటి పురస్కారాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ టాలీవుడ్ సింగర్ పై సీఎం రేవంత్ ప్రశంసల జల్లు కురిపించారు. ‘సొంత కృషితో ఎదిగిన రాహుల్‌ సిప్లిగంజ్‌ తెలంగాణ యువతకు మార్గదర్శకుడు’ అని రాహుల్ ను కొనియాడారు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ కలిసి పాడిన “నాటు నాటు” పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది. మార్చి 2023 లో జరిగిన 95వ అకాడమీ అవార్డుల వేడుకలో వీరు ఈ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఆ వేడుకలో ఈ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా ఎంపికైంది. ఆస్కార్‌ అవార్డు పొందిన అనంతరం రాహుల్‌ సిప్లిగంజ్‌కు 12 మే 2023న టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌ రెడ్డి రూ.10 లక్షల నగదు ప్రోత్సాహకం అందించారు. అదే సందర్భంగా  తాము అధికారంలోకి వస్తే రాహుల్‌కు రూ.కోటి నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు.

ఇక  ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిలిం అవార్డ్స్ పేరుతో పలువురు సినీ ప్రముఖులను ఘనంగా సన్మానించింది. ఇదే  అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ సిప్లిగంజ్ పేరును ప్రత్యేకంగా ప్రకటించారు. గద్దర్ అవార్డు కాకపోయినా..  హైదరాబాద్ లోకల్ కుర్రాడు అయిన రాహుల్ సిప్లిగంజ్ కు ప్రత్యేక అవార్డు ఏదైనా ఉంటే ప్రకటించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు. దీనికి ఆయన కూడా అంగీకరించారు.ఈ క్రమంలో తాజాగా సింగ్ రాహుల్ కు బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

బోనాల కానుకగా..

గద్దర్ అవార్డుల వేడుకలో సింగర్ రాహుల్ గురించి సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..