Mistake: ఒక్క పాటకోసం 40 మంది లిల్లీపుట్స్.. ఆకట్టుకుంటున్న ‘మిస్టేక్’ మూవీ సాంగ్..

పెద్ద సినిమాలనే కాదు చిన్న సినిమాలను కూడా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. కథ కథనం బాగుంటే చాలు ఆ సినిమా ప్రేక్షకుల్లోకి దూసుకెళ్తుంది.

Mistake: ఒక్క పాటకోసం 40 మంది లిల్లీపుట్స్..  ఆకట్టుకుంటున్న 'మిస్టేక్' మూవీ సాంగ్..
Mistake
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 16, 2021 | 4:55 PM

Mistake: పెద్ద సినిమాలనే కాదు.. కంటెంట్ చిన్న సినిమాలను కూడా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. కథ కథనం బాగుంటే చాలు ఆ సినిమా ప్రేక్షకుల్లోకి దూసుకెళ్తుంది. ఇప్పటికే చాలా సినిమాలు అది ఋజువు చేశాయి. మంచి సినిమా తీయాలనే పెద్ద దర్శకుడు పేరున్న నటులే కావాల్సిన అవసరం లేదు.. టేలెంటెడ్ డైరెక్టర్స్ ఉంటే సినిమా చిన్నదైనా, యాక్టర్లు కొత్తవారైనా హిట్ గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోవచ్చు. ఇదే కోవలో రీసెంట్ గా వచ్చిన రామ్ అసుర్ సినిమా అందుకు ఉదాహరణ. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో హీరోగానూ, ప్రొడ్యూసర్ గానూ సూపర్ సక్సెస్ అందుకున్న అభినవ్ సర్దార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ పై దండయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. తన స్వీయ నిర్మాణంలోనే తెరకెక్కించిన “మిస్టేక్” తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

సన్నీ కోమలపాటి దర్శకత్వంలో తెరకెకిన ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాలోని మొదటి పాట ‘గంటా గ్రహచారం’ యూట్యూబ్ ను షేక్ చేసేస్తోంది. మంగ్లీ, రోల్ రైడా గానం పాటలకు హైలైట్ కాగా, మణి జెన్నా స్వరాలు, శ్రీ శిరాగ్, రోల్ రైడా పదాలు ఈ సాంగ్ ను మరో రేంజ్ కు తీసుకువెళ్లాయనే చెప్పాలి. ఇటీవలే ఈ సాంగ్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. తాజాగా ఇదే సినిమాలో రెండవ పాటను భారీ స్థాయిలో విడుదల చేసింది చిత్రయూనిట్ . గుంటూరులోని VVIT కళాశాలలో సుమారు 4వేల మంది విద్యార్ధుల నడుమ ఈ పాటను విడుదల చేయగా, కార్యక్రమానికి చిత్రబృందంతో పాటూ విచ్చేసిన సింగర్ రేవంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ పాట కోసం సుమారు 40మంది లిల్లీపుట్స్ ను సేకరించినట్లు తెలిపారు. జంగిల్ థీమ్ తో ఆకట్టుకుంటోన్న ఈ పాట ఇప్పటికే యూట్యూబ్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. అభినవ్ సర్దార్ కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రంలో అజయ్ కతుర్వార్, తేజా అయినంపూడి, సుజిత్ కుమార్, కరిష్మా కుమార్ లీడ్ రోల్స్ లో కనిపించనున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని చిత్రబృందం అనౌన్స్ చేయనుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa: The Rise : ‘పుష్ప’ స్పెషల్ సాంగ్ కోసం అంత ఖర్చు పెట్టారా..! సమంత రెమ్యునరేషన్ ఎంతంటే..

Pushpa: బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు.. యూఏఈ నుంచి పుష్ప ఫస్ట్ రివ్యూ..

Pushpa Movie: బన్నీ సాహసాన్ని మెచ్చుకుంటున్న సినీ విశ్లేషకులు.. పుష్పరాజ్‌‌కు పాత్రను న్యాయం చేశాడంటూ..!!

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!