Pushpa Movie: బన్నీ సాహసాన్ని మెచ్చుకుంటున్న సినీ విశ్లేషకులు.. పుష్పరాజ్‌‌కు పాత్రను న్యాయం చేశాడంటూ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అడవుల నేపథ్యంలో చాలా సినిమాలు తెరకెక్కాయి. అయితే ఇప్పుడు వినూత్న నేపథ్యంలో రూపొందుతున్న

Pushpa Movie: బన్నీ సాహసాన్ని మెచ్చుకుంటున్న సినీ విశ్లేషకులు.. పుష్పరాజ్‌‌కు  పాత్రను న్యాయం చేశాడంటూ..!!
Allu Arjun
Follow us
Rajitha Chanti

| Edited By: Rajeev Rayala

Updated on: Dec 16, 2021 | 2:16 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో అడవుల నేపథ్యంలో చాలా సినిమాలు తెరకెక్కాయి. అయితే ఇప్పుడు వినూత్న నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలకు డిమాండ్ పెరుగుతుంది. ఇదే తరుణంలో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు పుష్ప..ది రైజ్ సినిమా రాబోతుంది. ఈ సినిమా కూడా అడవిలో సాగే కథే అని ముందుగానే డైరెక్టర్ సుకుమార్ హింట్ ఇచ్చాడు. ఫస్ట్ పోస్టర్ నుంచి సినిమా ఎలా ఉండబోతుందో.. హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే.. శేషాచలం అడవుల్లో ఎర్రచందనంకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఎర్రచందనం ఎక్కడ పట్టుబడినా దాని మూలాలు శేషాచలం కొండల్లోనే ఉంటాయి. శేషాలచలం కొండల్లో పెరుగుతున్న ఈ సూపర్ ఫైన్ క్వాలిటీ ఎర్ర చందనం కోసం ప్రాణాలకు తెగించి గడపదాటిస్తున్నారు స్మగ్లర్లు. ఎర్ర చందనం ప్రపంచంలో అత్యంత విలువైన కలపగా గుర్తింపు పోందింది. దీన్ని ఎర్ర బంగారం అని కూడా ముద్దుగా పిలుస్తుంటారు.. అయితే ఇది మ‌న‌ ఆంధ్రప్రదేశ్ లో తప్ప ప్రపంచంలో మరెక్కడా పెరగదు, దోర‌క‌దు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కేవలం నాలుగు జిల్లాలలో మాత్రమే పెరుగుతుంది. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో విస్తరించి వున్న నల్లమల అడవులలో మాత్రమే ఈ ఎర్ర చందనం చెట్లు పెరుగుతాయి. ఇక్కడి నుండే అక్రమ స్మగ్లింగ్ కుడా జ‌రుగుతుంటుంది.

ఇప్పుడు ఇదే కథాంశంను వెండితెరపై సినిమాగా తీసుకున్నారు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించడం మరో విశేషం. అది కూడా స్టార్ హీరో స్మగ్లర్ పాత్రలో కనిపించనుడడంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. మునుపెంచని కనిపించని ఊరమాస్ లుక్‏లో బన్నీ కనిపించనున్నాడు. హీరో అంటే పోలీస్ గెటప్స్ లోనూ.. లేదంటే విలన్స్ అంతు చూసే క్యారెక్టర్స్ లోనూ కనిపిస్తుంటారు.. కానీ ఇప్పుడు పుష్పలో మాత్రం బన్నీ పూర్తిగా పోలీసులకు దొరకని ఓ స్మగ్లర్ పాత్రలో నటించడం సాహసమే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటి వరకు విడుదలైన టీజర్స్, ట్రైలర్ చూశాక.. బన్నీ పుష్పరాజ్ పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడంటున్నారు ప్రేక్షకులు.. అభిమానులు. ఇక సినిమా విడుదలైన తర్వాత పుష్ప రాజ్ పాత్రను అంత సులువుగా మర్చిపోలేరంటున్నారు చిత్రయూనిట్. ఈ సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో అనేది చూడాలి. ఇందులో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్‏గా నటిస్తుండగా.. విలన్ పాత్రలో మలయాళ స్టార్ ఫహద్ పాజిల్ కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో సునీల్, అనసూయ కీలక పాత్రలలో నటిస్తున్నారు. పుష్ప సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు రేపు (డిసెంబర్ 17న) థియేటర్లలో పుష్పరాజ్.. శ్రీవల్లీ సందడి చేయనున్నారు.

Also Read: Brahmastra: ‘సామాన్యుల ఊహకు అందనిది, ఈ విశ్వంలో ఏదో జరుగుతోంది’.. ఆసక్తిని పెంచేసిన బ్రహ్మస్త్ర మోషన్ పోస్టర్..

RRR Trailer: రికార్డుల వేటలో దూసుకుపోతున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌ ట్రైలర్‌.. ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్‌ సినిమా ఇదే..

Rashmika Mandanna: రష్మికను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కన్నడ బ్యూటీ..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?