Pushpa Movie: పుష్ప రిలీజ్ వాయిదా అంటూ పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..

Pushpa Movie: టాలీవుడ్ స్టైలిష్ స్టార్.. అల్లు అర్జున్ ఫ్యాన్స్  థియేటర్స్ వద్ద సందడి మొదలైంది. పుష్ప సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులను..

Pushpa Movie: పుష్ప రిలీజ్ వాయిదా అంటూ పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..
Pushpa
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 16, 2021 | 2:46 PM

Pushpa Movie: టాలీవుడ్ స్టైలిష్ స్టార్.. అల్లు అర్జున్ ఫ్యాన్స్  థియేటర్స్ వద్ద సందడి మొదలైంది. పుష్ప సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులను మరికొన్ని గంటల్లో పుష్ప సినిమా అలరించడానికి రెడీ అవుతున్న నేపథ్యంలో సినిమా వాయిదా అంటూ వినిపిస్తున్న పుకార్ల పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.  పుష్ప సినిమా రిలీజ్ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బన్నీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే పుష్ప సినిమా రేపు రిలీజ్ కావడంలేదని… డిసెంబర్ 23వ తేదీన రిలీజ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ బన్నీ పుష్ప సినిమాను అనుకున్న తేదీకి, అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తున్నామని.. వాయిదా అన్న మాట లేదని ప్రకటించింది.

అల్లు అర్జున్,  రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా పుష్ప తెరకెకెక్కింది. బన్నీ కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. బన్నీ, సుక్కు, దేవి శ్రీ కాంబో అంటేనే సంగీత ప్రియులకు ఓ రేంజ్ లో కిక్.. ఇప్పటికే సినిమాలోని సాంగ్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక దేవి ఎప్పటిలా తనదైన శైలి ఐటెం సాంగ్ తో కుర్రకారుని ఊపేస్తున్నాడు.

బన్నీ కెరీర్‌లో భారీ ప్రి రిలీజ్‌ బిజినెస్ జరిగిన ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన అన్ని పాటలు యూట్యూబ్ ను ఒక ఊపు ఊపేస్తున్నాయి.

ఇక సమంత చేసిన ఐటమ్ సాంగ్ ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. పుష్ప థియేటర్లలోకి వచ్చేందుకు మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ హడావుడి ఓ రేంజ్లో ఉంది. అల్లు అర్జున్ సినీ కెరీర్లో  మొదటి పాన్ ఇండియా సినిమా పుష్ప.  ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తమిళనాడు,  కేరళ ,  కర్ణాటక తో పాటు హిందీ లో భారీగా రేంజ్ లో రిలీజ్ కానున్నది.

Also Read: మున్సిపల్ ఎన్నికలకు ముందస్తు వ్యూహాలు… ఎన్నికల ప్రచారం ప్రారంభించిన లోకేష్

Latest Articles