AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Municipal Election: మున్సిపల్ ఎన్నికలకు ముందస్తు వ్యూహాలు… ఎన్నికల ప్రచారం ప్రారంభించిన లోకేష్

Municipal Election: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో టిడిపి కొంత మేర పుంజుకుంది. కుప్పం మున్సిపాలిటీని కోల్పోయిన దర్శి నగర పంచాయతీని దక్కించుకుంది..

Municipal Election: మున్సిపల్ ఎన్నికలకు ముందస్తు వ్యూహాలు... ఎన్నికల ప్రచారం ప్రారంభించిన లోకేష్
Tdp Lokesh
Surya Kala
|

Updated on: Dec 16, 2021 | 1:34 PM

Share

Municipal Election: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో టిడిపి కొంత మేర పుంజుకుంది. కుప్పం మున్సిపాలిటీని కోల్పోయిన దర్శి నగర పంచాయతీని దక్కించుకుంది. గుంటూరు జిల్లా దాచేపల్లిలో అధికార పార్టికి గట్టి పోటినిచ్చింది. ఎంపి ఓటుతో కొండపల్లి మున్సిపాదిటిని దక్కించుకునే ప్రయత్నం జరుగుతోంది. ఈ ఎన్నికల ఫలితాలతో అధికార పార్టిని ఢీ కొట్టేందుకు టిడిపి ప్రయత్నిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కోర్టు కేసుల కారణంగ నర్సరావుపేట, బాపట్ల, పొన్నూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగలేదు. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలను కలిపి ప్రభుత్వం కార్పోరేషన్ చేసింది. రాజధాని ప్రాంతంలో కూడా ఎన్నికలు జరగ లేదు. ఈ క్రమంలో ఆయా మున్సిపాలిటీలకు ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చన్న ప్రచారం ఊపందుకుంది. రాజధాని ప్రాంతంలో ఎన్నికలు ఎందుకు జరపలేదని కోర్టు కూడా ప్రశ్నించింది. దీంతో ఎన్నికలు ఎప్పుడైనా జరగవచ్చని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.

ఈ నేపధ్యంలోనే లోకేష్ మంగళగిరి, తాడేపల్లి కార్పోరేషన్ పై దృష్టి సారించారు. వారంలో రెండు మూడు రోజులు ఇక్కడే పర్యటిస్తున్నారు. సిఎం జగన్ నివాసముండే మున్సిపల్ కార్పోరేషన్ కావటంతో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. దీంతో పట్టు సాధించాలని టిడిపి భావిస్తుంది. మరోవైపు విజయం సాధించే విధంగా అభివృద్ధి పనులకి ఎమ్మెల్యే ఆర్కే శ్రీకారం చుట్టారు. మంగళగిరి లక్ష్మీ నరసింహా ఆలయంతో పాటు ధ్యాన బుద్ద రోడ్డును అభివృద్ది చేస్తున్నారు. లోకేష్, ఎమ్మెల్యే ఆర్కే ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ పెంచారు.

మరోవైపు నర్సరావుపేట మున్సిపాలిటీలోనూ టిడిపి, వైసిపి నేతలు ముందస్తు ప్రచారం ప్రారంభించారు. గుడ్ మార్నింగ్ పేరుతో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి వార్డుల పర్యటన చేస్తుంటే ఇంటింటికి అరవిందన్న పేరుతో టిడిపి ఇంఛార్జ్ అరవింద బాబు వార్డుల పర్యటన చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభమైందని స్థానికులు అనుకుంటున్నారు. ఇక బాపట్ల, పొన్నూరు మున్సిపాలిటీల్లో రెండు పార్టీల్లోనూ కొంత స్థబ్థత నెలకొంది. బాపట్లలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, టిడిపి నేత నరేంద్ర వర్మ పూర్తి స్థాయిలో ఎన్నికలపై దృష్టి సారించలేదు. పొన్నూరులో ముఖ్య నేతలు కిలారి రోశయ్య, ధూళిపాళ్ల నరేంద్ర ఢీ అంటే ఢీ అంటున్న ప్రచారాన్ని ప్రారంభించలేదు అయితే ముఖ్యమైన పట్టణాల్లో ఎన్పికలు కావడంతో రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచేందుకు ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తున్నాయి.

Nagaraju, Guntur dist, tv9

Also Read:   మహారాష్ట్రలో ఎడ్ల బండ్ల పందాల నిర్వహణకు సుప్రీం సై.. అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే నిబంధనలు ఉండాలంటూ వ్యాఖ్యలు..