AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు.. యూఏఈ నుంచి పుష్ప ఫస్ట్ రివ్యూ..

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ 'పుష్ప' ప్రభంజనం మొదలయ్యేందుకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి

Pushpa: బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు.. యూఏఈ నుంచి పుష్ప ఫస్ట్ రివ్యూ..
Basha Shek
|

Updated on: Dec 16, 2021 | 3:38 PM

Share

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ‘పుష్ప’ ప్రభంజనం మొదలయ్యేందుకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. క్రియేటివ్‌ డైరెక్టర్‌ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం రేపు (డిసెంబర్17) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటివరకు బన్నీని స్టైలిష్‌ పాత్రల్లోనే చూసిన అభిమానులు తొలిసారిగా ఊర మాస్‌ పుష్పరాజ్‌గా చూసేందుకు ఉవ్విళ్లూరుతున్న తరుణంలో ముందుగానే సినిమా రివ్యూ వచ్చేసింది. ప్రముఖ సినీ విశ్లేషకుడు, దుబాయ్‌ సెన్సార్‌ బోర్డు సభ్యుడు ఉమైర్‌ సంధు తరచూ సినిమా విడుదలకు ముందే రివ్యూలను వెల్లడిస్తుంటాడు. తాజాగా అతను పుష్ప సినిమాకు కూడా రివ్యూ ఇచ్చేశాడు. ఫస్ట్‌ హాఫ్‌ అద్భుతంగా ఉందని మెచ్చుకున్న ఆయన సినిమా మొత్తం చూశాక ‘పుష్ప’ ఈ ఏడాదిలోనే ఉత్తమ టాలీవుడ్‌ చిత్రంగా నిలుస్తుందన్నారు. ‘ అల్లు అర్జున్‌ కెరీర్‌లో ఈ సినిమా మరొక మైలురాయి అని కచ్చితంగా చెప్పవచ్చు. లారీ డ్రైవర్‌గా ఊరమాస్‌ అవతారంలో బన్నీ అదరగొట్టాడని, ఆయన అభిమానులకు పూనకాలు రావడం ఖాయం.

‘పుష్పరాజ్‌ ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక అద్భుతంగా నటించింది. ఇంటర్వెల్ బ్యాంగ్‌, సామ్‌ స్పెషల్ సాంగ్‌ అదిరిపోయాయి. డైరెక్టర్‌ క్రియేటివిటీకి తగ్గట్లే సినిమా కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ ఓ రేంజ్‌లో ఉన్నాయి. వింటర్‌ బ్లాక్‌ బస్టర్‌ని ఎంజాయ్‌ చేయండి’ అని సినిమాకు ఏకంగా నాలుగు స్టార్ల రేటింగ్‌ ఇచ్చారు ఉమైర్‌. కాగా ఈ సినిమాలో బన్నీ, రష్మికలతో పాటు అనసూయ, సునీల్‌, ఫాహద్‌ ఫజిల్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ అందించిన పాటలు యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్నాయి. సామ్‌ స్పెషల్‌ సాంగ్‌ అయితే మిలియన్ల వ్యూస్‌ అందుకుంటోంది. విడుదలకు ముందే ఇన్ని సంచలనాలు సృష్టించిన ‘పుష్ఫ’ రిలీజ్‌ తర్వాత మరెన్ని ప్రభంజనాలు సృష్టిస్తాడో చూడాలి.

Also Read:

Pushpa Movie: బన్నీ సాహసాన్ని మెచ్చుకుంటున్న సినీ విశ్లేషకులు.. పుష్పరాజ్‌‌కు పాత్రను న్యాయం చేశాడంటూ..!!

Pushpa Movie: పుష్ప రిలీజ్ వాయిదా అంటూ పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..

Pushpa Special Song: పుష్ప స్పెషల్ సాంగ్ మేల్ వెర్షన్ అదిరిపోయిందిగా.. ఊ అంటావా పాప.. ఊహు అంటావా పాప..

30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి