AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Trailer: రికార్డుల వేటలో దూసుకుపోతున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌ ట్రైలర్‌.. ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్‌ సినిమా ఇదే..

RRR Trailer: బాహుబలి లాంటి వండర్‌ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌ చిత్రం కోసం యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. దేశంలోని దాదాపు అన్ని...

RRR Trailer: రికార్డుల వేటలో దూసుకుపోతున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌ ట్రైలర్‌.. ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్‌ సినిమా ఇదే..
Rrr Trailer
Narender Vaitla
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 16, 2021 | 6:47 AM

Share

RRR Trailer: బాహుబలి లాంటి వండర్‌ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌ చిత్రం కోసం యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. దేశంలోని దాదాపు అన్ని భాషలతో పాటు ఇతర దేశాల్లోనూ ఈ సినిమా జనవరి 7న విడుదల కానుంది. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు మునుపెన్నడూ కనిపించని పాత్రల్లో నటిస్తుండడం, జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో అందరిలోనూ ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇక తాజాగా చిత్ర యూనిట్‌ విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌ ఒక్కసారిగా అంచనాలను ఆకాశాన్ని పెంచేశాయి. ముఖ్యంగా ట్రైలర్‌లో ఉన్న ఎమోషన్‌, యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆర్‌.ఆర్‌.ఆర్‌ ట్రైలర్‌ రికార్డులు బద్దలు కొడుతోంది. ట్రైలర్‌ విడుదలైన ఆరు రోజుల్లో 100 మిలియన్లకు పైగా వ్యూస్‌తో సరికొత్త చరిత్రను తిరగరాసింది. ఈ ట్రైలర్‌ అన్ని భాషల్లో కలిసి 100 మిలియన్లను దాటేసింది. ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా ఆర్‌ఆర్‌ఆర్‌ బెంచ్‌ మార్క్‌ను సెట్‌ చేసింది. మరి విడుదలకు ముందే ఈ సినిమా ఇలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుంటే థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలో అలియా భట్‌, అజయ్‌ దేవగణ్‌తో పాటు పలువురు హాలీవుడ్‌ నటీనటులు కూడా కనిపించనున్న విషయం తెలిసిందే.

Also Read: Bigg Boss 5 Telugu Highlights: ముగిసిన102వ ఎపిసోడ్.. సిరి, షణ్ముఖ్‌ల ఎమోషన్‌ జర్నీని కళ్లకు కట్టినట్టు చూపించిన బిగ్‌బాస్‌..

Omicron Variant: ఏడేళ్ల బాలుడికి పాజిటివ్.. హైదరాబాద్ నుంచే పయనం.. దేశంలో హడలెత్తిస్తున్న ఒమిక్రాన్..

Toyota Electric Cars: టయోటా నుంచి 30 ఎలక్ట్రిక్‌ కార్లు.. ఎప్పటి వరకు అంటే..!