Rashmika Mandanna: రష్మికను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కన్నడ బ్యూటీ..

ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా అభిమానులకు.. సెలబ్రెటీలకు మధ్య వారధిగా

Rashmika Mandanna: రష్మికను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కన్నడ బ్యూటీ..
ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల భామ రష్మిక మందన్న.
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 15, 2021 | 9:57 PM

ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా అభిమానులకు.. సెలబ్రెటీలకు మధ్య వారధిగా మారింది ఇంటర్నెట్. తమ అభిమాన హీరోహీరోయిన్స్ గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియాను తెగ ఉపయోగించుకుంటారు. ఇక సెలబ్రెటీలు సైతం తమ లేటేస్ట్ ఫోటోలతోపాటు.. సినిమా అప్డేట్స్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఫ్యాన్స్‏కు టచ్‏లో ఉంటారు.

అయితే కొన్నిసార్లు సోషల్ మీడియా ద్వారా సెలబ్రెటీలకు తలనొప్పి మాత్రం తగ్గడం లేదు. తమకు నచ్చని సెలబ్రెటీలను దారుణంగా ట్రోల్ చేయడం.. వారు షేర్ చేసే ఫోటోలకు.. వీడియోలకు నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇలా ట్రోల్ చేయడం ఎక్కువగా జరుగుతుంటుంది. ఇటీవల పాయల్ రాజ్ పుత్‏కు సంబంధించిన వీడియోపై.. ఆమె షేర్ చేసిన ఫోటోలపై దారుణంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నేషనల్ క్రష్ రష్మికను ట్రోల్ చేశాడు ఓ నెటిజన్.

Rashmika

Rashmika

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం పుప్ప. ఈ సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‏లో చిత్రయూనిట్ బిజీగా గడిపేస్తుంది. తాజాగా ఓఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ సామీ సామీ పాట కోసం ఎంతో కష్టపడ్డాను.. అది చూశాక అందరూ నన్ను ప్రశంసిస్తే చాలు. డైరెక్టర్స్ ఏం చెబితే అదే నేను చెస్తా అంటూ మాట్లాడిన వీడియోను రష్మిక తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. అసలు దీన్ని హీరోయిన్ గా తీసుకోకుండా ఉండాల్సింది. ఇది.. దీని ఓవర్ యాక్టింగ్ అంటూ కామెంట్ చేశాడు. ఇది చూసిన రష్మిక… యాక్టింగో.. ఓవరాక్టింగో.. నేను జీవితంలో ఏదో ఒకటి సాధించాను నువ్వు ఏం సాధించావు నాన్నా.. అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: Pushpa Item Song: సమంత సాంగ్ ఇష్యూపై మాధవిలత సంచలన కామెంట్స్.. ఛ.. పరువు పోయిందంటూ..

Nani: కల్లు ఇష్టం.. వరంగల్లు ఇష్టం.. ఆమెను చూసి నటించడమే మర్చిపోయా.. నాని ఆసక్తికర కామెంట్స్..

Sara Ali Khan: నేనూ తప్పులు చేశాను.. సోషల్‌ మీడియా ట్రోల్స్‌ గురించి పట్టించుకోను.. సారా ఆసక్తికర వ్యాఖ్యలు..

పాకిస్తానీ మూలాలున్న బ్రిటిషర్లు రెచ్చిపోతున్నారుః మస్క్
పాకిస్తానీ మూలాలున్న బ్రిటిషర్లు రెచ్చిపోతున్నారుః మస్క్
కాన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్
కాన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్
డేంజర్ బెల్స్.. చైనాలో మరో మహమ్మారి.. భారత్ అలర్ట్
డేంజర్ బెల్స్.. చైనాలో మరో మహమ్మారి.. భారత్ అలర్ట్
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్