Brahmastra: ‘సామాన్యుల ఊహకు అందనిది, ఈ విశ్వంలో ఏదో జరుగుతోంది’.. ఆసక్తిని పెంచేసిన బ్రహ్మస్త్ర మోషన్ పోస్టర్..

Brahmastra Teaser: రణ్‌బీర్‌ కపూర్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'బ్రహ్మస్త్ర'. ఈ సినిమాలో అలియాభట్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. నిజానికి ఇది బాలీవుడ్‌ చిత్రమే అయినా ఇందులో కింగ్‌ నాగార్జున కూడా నటిస్తుండడంతో...

Brahmastra: 'సామాన్యుల ఊహకు అందనిది, ఈ విశ్వంలో ఏదో జరుగుతోంది'.. ఆసక్తిని పెంచేసిన బ్రహ్మస్త్ర మోషన్ పోస్టర్..
Brahmastra
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Dec 16, 2021 | 6:47 AM

Brahmastra : రణ్‌బీర్‌ కపూర్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మస్త్ర’. ఈ సినిమాలో అలియాభట్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. నిజానికి ఇది బాలీవుడ్‌ చిత్రమే అయినా ఇందులో కింగ్‌ నాగార్జున కూడా నటిస్తుండడంతో ఈ సినిమాపై టాలీవుడ్‌ ప్రేక్షకుల దృష్టి పడింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఎక్కడ లేని అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, డింపుల్‌ కపాడియా, నాగార్జున నటిస్తుండడంతో అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోయింది. నిజానికి ఈ సినిమా చాలా రోజుల క్రితమే ప్రారంభమైనప్పటికీ కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈ సినిమాకు సంబంధించి ఒక్క అప్‌డేట్‌ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్‌ నిరూత్సాహపడ్డారు. అయితే షూటింగ్‌ వేగవంతం చేసిన చిత్ర యూనిట్‌ తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ మోషన్ పోస్టర్ విడుదల చేసింది.

సినిమా కథాంశాన్ని చెప్పకనే చెప్పిన ఈ మోషన్ పోస్టర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా ప్రారంభంలో వచ్చే.. ‘ఈ విశ్వంలో ఏదో జరుగుతోంది.. సామాన్యుల ఊహకు సైతం అందనిది అది.. అత్యంత పురాతన శక్తి.. అదో అస్త్రం.. అదేంటి’ అనే వచ్చే డైలాగ్‌ క్యూరియాసిటీని పెంచేసింది. ఈ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ శివ పాత్రను ఈ టీజర్‌లో చూపించారు. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా తొలి భాగాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 9న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. మరి అద్భుతంగా ఉన్న ఈ మోషన్ పోస్టర్ పై మీరూ ఓసారి లుక్కేయండి..

Also Read: Banana Benefits: చలికాలంలో అరటిపండు తింటున్నారా.. అయితే ఈ సంగతి తప్పనిసరిగా తెలుసుకోండి..

Flaxseed Gel: అవిసెగింజలతో జట్టు సమస్యలకు చెక్.. ఫ్లాక్స్ సీడ్ జెల్ ఉపయోగాలు తెలిస్తే షాకే..

Toyota Electric Cars: టయోటా నుంచి 30 ఎలక్ట్రిక్‌ కార్లు.. ఎప్పటి వరకు అంటే..!