Raj Kundra Case: పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రాకు ఊరట.. మరికొన్ని రోజులు బెయిల్ పొడిగింపు..
Raj Kundra Case: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు పోర్నోగ్రఫీ కేసులో.. సర్వోన్నత న్యాయస్థానం నుంచి కాస్త ఊరట లభించింది. రాజ్ కుంద్రా అరెస్టు కాకుండా సుప్రీంకోర్టు నాలుగు
Raj Kundra Case: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు పోర్నోగ్రఫీ కేసులో.. సర్వోన్నత న్యాయస్థానం నుంచి కాస్త ఊరట లభించింది. రాజ్ కుంద్రా అరెస్టు కాకుండా సుప్రీంకోర్టు నాలుగు వారాల బెయిల్ ను మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో రాజ్ కుంద్రా మరో నాలుగు వారాలపాటు అరెస్టు చేయొద్దంటూ పోలీసులకు సూచనలు చేసింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం మహారాష్ట్ర ప్రభుత్వానికి, సైబర్ క్రైం పోలీసులకు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే నవంబర్ 25న బాంబే హైకోర్టు ముందస్తు బెయిల్ కోసం రాజ్ కుంద్రా దాఖలు చేసిన పిటీషన్‌ను తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో రాజ్ కుంద్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలో సుప్రీంకోర్టులో పోర్నోగ్రఫీ వ్యవహారంపై విచారణ జరిగింది. రాజ్ కుంద్రా వీడియోలు శృంగారభరితమైనవే అయినప్పటికీ, వాస్తవానికి ఎలాంటి శారీరక లేదా లైంగిక కార్యకలాపాలను చూపించలేదంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. పైగా తాను అటువంటి వీడియోల తయారీలో, ప్రసారంలో పాల్గొనలేదంటూ రాజ్ కుంద్రా ధర్మాసననానికి తెలియజేశాడు. దీంతోపాటు తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారంటూ అభిప్రాయపడ్డాడు. అయినప్పటికీ ముంబై హైకోర్టు బెయిల్‌ను నిరాకరిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో రాజ్ కుంద్రా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
కాగా.. ఈ కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు.. ఇప్పటికే రాజ్ కుంద్రా, నటి గహనా వశిష్ట్, షెర్లిన్ చోప్రా తదితరులను విచారించిన సంగతి తెలిసిందే.
Also Read: