Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu Highlights: ముగిసిన102వ ఎపిసోడ్.. సిరి, షణ్ముఖ్‌ల ఎమోషన్‌ జర్నీని కళ్లకు కట్టినట్టు చూపించిన బిగ్‌బాస్‌..

Rajitha Chanti

| Edited By: Narender Vaitla

Updated on: Dec 15, 2021 | 11:06 PM

Bigg Boss Telugu 5 Live Updates: బిగ్‏బాస్ సీజన్ 5 చివరి అంకానికి చేరుకుంది. 19 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన

Bigg Boss 5 Telugu Highlights: ముగిసిన102వ ఎపిసోడ్.. సిరి, షణ్ముఖ్‌ల ఎమోషన్‌ జర్నీని కళ్లకు కట్టినట్టు చూపించిన బిగ్‌బాస్‌..
Biggboss

Bigg Boss Telugu 5 102 Episode Highlights: బిగ్‌బాస్‌ 5 తెలుగు రియాలిటీ షో ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. బుధవారం 102వ ఎపిసోడ్‌ పూర్తయింది. బిగ్‌బాస్‌ ఫినాలేకు ఇంకా కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం హౌస్‌లో కేవలం ఐదురుగు మాత్రమే ఉన్నారు. సిరి, షణ్ముఖ్‌, మానస్‌, సన్నీ, శ్రీరాచంద్రలో ఒకరు ఈసారి టైటిల్‌ను కొట్టేందుకు సిద్ధమయ్యారు. ఎపిసోడ్‌ దగ్గర పడుతుండడంతో ఇన్నాళ్లు హౌస్‌లో కంటెస్టెంట్‌ల జర్నీని ప్రేక్షకులకు చూపిస్తున్నారు బిగ్‌బాస్‌ నిర్వాహకులు. ఇందులో భాగంగా కంటెస్టెంట్‌ల జర్నీకి సంబంధించిన ఫోటోలను ప్రదర్శనకు ఉంచారు.

ఇందులో భాగంగా బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో సిరి ఎమోషనల్‌ జర్నీని చూపించారు. అలాగే ఇతర కంటెస్ట్‌లు సైతం తమ జర్నీని పంచుకున్నారు. ఇక హస్‌లో ఉన్న కంటెస్టెంట్‌లకు సంబంధించిన ఫోటోల్లో బెస్‌ ఫోటోలను ఎంచుకొని వాటి గురించి వివరిస్తూ హౌస్‌మేట్స్‌ చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి. ఇలా ఒక్కొక్కరు వివరించడంతో బుధవారం ఎపిసోడ్‌ పూర్తయింది. మరి రేపటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌ ఎలాంటి సర్‌ప్రైజ్‌ ఇస్తాడో చూడాలి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Dec 2021 10:51 PM (IST)

    సిరి, షణ్ముఖ్‌లు కంటెంట్‌ క్రియేట్‌ చేస్తారన్న మానస్‌.. షణ్ముఖ్‌ ఎలా స్పందించాడంటే..

    సిరి, షణ్ముఖ్‌లు కలిసి కంటెంట్‌ క్రియేట్‌ చేయడానికే అలా చేస్తున్నారని మానస్‌ గతంలో అన్న వ్యాఖ్యలపై షణ్ముఖ్‌ తన దైన శైలిలో స్పందించాడు. మానస్‌ తప్పు మాట అన్నాడని చెప్పిన షణ్ముఖ్‌.. వెనకాల కంటెంట్‌ అంటూ ముందు వచ్చి మనకు సహాయం చేస్తున్నట్లు నటిస్తాడు అని చెప్పుకొచ్చాడు. ‘అందరూ వీడు ఎంత హెల్ప్‌ చేస్తున్నాడో చూడు’ అనుకోవాలని మానస్‌ అలా చేస్తుంటాడు, అందుకే నేను ఆ అవకాశం ఇవ్వను నువ్వు ఎందుకు ఇస్తున్నావు అంటూ సిరిని ప్రశ్నించాడు షణ్ముఖ్‌.

  • 15 Dec 2021 10:36 PM (IST)

    సిరి, షణ్ముఖ్‌ల ఎమోషనల్‌ జర్నీ..

    బిగ్‌బాస్‌ 5వ సీజన్‌లో ప్రముఖంగా చెప్పుకునే కంటెస్టెంట్‌లలో సిరి, షణ్ముఖ్‌లు మొదటి వరుసలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఉంది స్నేహమా, ప్రేమా.? అన్న విషయంపై తీవ్ర చర్చకు దారి తీసింది. హగ్‌లు, ఎమోషన్స్‌, ఇద్దరి బంధం నిత్యం సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీసింది. తాజాగా సిరి జర్నీని ఏవీ రూపంలో చూపించిన బిగ్‌బాస్‌ ఈ విషయాలను ప్రస్తావించారు. సిరి, షణ్ముఖ్‌ల మధ్య జరిగిన ఎమోషనల్‌ జర్నీకి సంబంధించిన వీడియో సిరిని కంటతడి పెట్టించింది. ఇక సిరి బాయ్‌ ఫ్రెండ్‌ శ్రీయాన్‌ బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం, ఆ సమయంలో సిరి ఎదుర్కొన్న ఎమోషనల్‌ జర్నీ వీక్షకులను సైతం ఎమోషన్‌కు గురి చేసింది.

  • 15 Dec 2021 10:30 PM (IST)

    సిరి ప్రయాణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన బిగ్‌బాస్‌..

    Siri

    ప్రస్తుతం బిగ్‌బాస్‌ 102వ ఎపిసోడ్‌ కొనసాగుతోంది. సీజన్‌ 5 మరో మూడు రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో హౌజ్‌మేట్స్‌కు తమ జర్నీకి సంబంధించిన ఫోటోలను బిగ్‌బాస్‌ నిర్వాహకులు ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా సిరి ఒక్కో ఫోటోను చూస్తూ ఎమోషనల్‌కు గురైంది. వంద రోజుల ప్రయాణంలో తాను చేసిన టాస్క్‌లు, కిల్లి గజ్జాలు, గొడవలకు సంబంధించిన ఫోటోలను ప్రదర్శించారు. ఫోటో కలెక్షన్‌ బాగుందంటూ సిరి బిగ్‌బాస్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఇక కొన్ని ఏవీలు సైతం ప్రదర్శించారు.

  • 15 Dec 2021 10:11 PM (IST)

    రవికి మద్ధతుగా నిలిచిన యానీ మాస్టర్‌.. తాను కూడా ఫిర్యాదు చేస్తానని..

    బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనపై సోషల్‌ మీడియాలో పరుష పదజాలంతో మాటల దాడులు జరుగుతున్నాయని యాంకర్‌ రవి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రవి తీసుకున్న నిర్ణయాన్ని మరో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ యానీ మాస్టర్‌ అభినందించారు. నోటికొచ్చినట్లు మాట్లాడినా, చెడ్డ కామెంట్లు పెట్టినా తాను కూడా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బిగ్‌బాస్‌ హౌస్‌లో 24 గంటలు ఏం జరుగుతుందనేది మీకు తెలియదని, కాబట్టి విమర్శించడం మానేస్తే మంచిదని వార్నింగ్‌ ఇచ్చారు.

  • 15 Dec 2021 09:56 PM (IST)

    ఫేక్ ఫ్రెండ్ అన్నాను.. కానీ అది తప్పని తెలుసుకున్నా..

    బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు ముగియడానికి మరో మూడు రోజ్రుల సమయం మాత్రమే ఉంది. దీంతో విన్నర్ ఎవరనేది తెలుసుకోవడానికి ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో తమ సంతోష చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకోవాలని తెలిపారు బిగ్ బాస్. బ్రిక్స్‌ ఛాలెంజ్‌ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను.. ఎందుకంటే ఈ టాస్క్‌కు ముందే షణ్నును ఫేక్‌ ఫ్రెండ్‌ అన్నాను. కానీ అది తప్పని బ్రిక్స్‌ ఛాలెంజ్‌లోనే తెలిసింది అంటూ చెప్పుకొచ్చింది సిరి.

  • 15 Dec 2021 09:50 PM (IST)

    కళ్లముందే ముక్కలయ్యింది.. షణ్ముఖ్.

    గడిచిన వంద రోజులలో అనేక టాస్కులు ఆడారు. అందులో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలని.. సంతోష, చేదు సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు కంటెస్టెంట్స్. అయితే జర్నీ మొత్తంలో బాగా బాధపడిన క్షణాలేవైనా ఉన్నాయా అంటే అది అమ్మ రాసిన లెటర్‌ కళ్లముందే ముక్కలవడం అంటూ ఎమోషనల్ అయ్యాడు షణ్ముఖ్.

  • 15 Dec 2021 09:44 PM (IST)

    జర్నీ వీడియో చూసి ఎగిరి గంతులేసిన సిరి..

    ఈరోజు ఎపిసోడ్‏లో సిరి జర్నీకి సంబంధించిన వీడియోను చూపించనున్నారు బిగ్ బాస్. ఇప్పటికే సిరి జర్నీ ప్రోమో విడుదల చేశారు. తన జర్నీ ఫోటోలను చూసి ఆనందంతో గంతులేసింది సిరి. ఇక ఆ తర్వాత సిరిని ప్రశంసలతో ముంచేత్తాడు బిగ్‏బాస్. మీ అనుభవాల పునాదులపై మీకు మీరు సిరి అంటే ఎంటో ప్రపంచానికి చూపాలనే తపన.. కళ్లకు కట్టినట్లుగా అందరికి కనిపించింది. మీ కోపమైనా.. మీ ఇష్టమైనా.. మీ బంధమైనా.. మీరు నమ్మినదాని కోసం మీ గొంతును గట్టిగా వినిపించారు.. ఈ బిగ్‏బాస్ ఇల్లు ఎన్నో భావోద్వేగాల నిధి అయితే అందులోని సిరి మీరు అంటూ సిరిని ప్రశంసలతో ముంచేత్తాడు బిగ్‏బాస్.

  • 15 Dec 2021 09:40 PM (IST)

    హమీదాను చాలా మిస్సవుతున్నా..

    తాజా ప్రోమోలో వంద రోజుల్లో ఎన్నో టాస్కులు ఆడించిన బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌ గడిచిన జ్ఞాపకాలను తడిమి చూసుకునేందుకు కావాల్సినంత సమయాన్నిచ్చాడు. అందులో భాగంగా వారి సంతోష, చేదు సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌ అయ్యారు ఫైనలిస్టులు. నేనెప్పుడు చెప్పలేదు కానీ హమిదాను చాలా మిస్సవుతున్నా..ఆమె ఉంటే లోన్ రేంజర్ అనే పేరు వచ్చేది కాదు.. ఈ జర్నీలో చాలా మిస్సవుతున్నా అన్నాడు శ్రీరామచంద్ర.

  • 15 Dec 2021 09:36 PM (IST)

    బిగ్‏బాస్ సీజన్ 5 అప్డేట్స్..

    బిగ్‏బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. మరో మూడ్రోజుల్లో విన్నర్ ఎవరనేది తేలిపోనుంది. అభిమానులు వారి వారి ఫేవరేట్ కంటెస్టెంట్లను గెలిపించేందుకు ఒకవైపు ప్రచారాలు చేస్తూనే.. మరోవైపు ఓటింగ్స్ తో హోరెత్తిస్తున్నారు.

  • 15 Dec 2021 09:33 PM (IST)

    బిగ్‏బాస్ సీజన్ 5 అప్డేట్స్..

    బిగ్ బాస్ ఈరోజు 102వ ఎపిసోడ్. ఇప్పటికే సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్, మానస్‏ల బిగ్ బాస్ జర్నీలకు సంబంధించిన వీడియోలను చూపించారు. ఈరోజు ఎపిసోడ్ లో సిరికి సంబంధించిన బిగ్ బాస్ జ్ఞాపకాలతో కూడిన జర్నీ వీడియోను చూపించనున్నారు.

Published On - Dec 15,2021 9:30 PM

Follow us