Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యూట్ ఎక్స్‌ప్రెషన్లతో కవ్విస్తున్న ఈ చిన్నారి సౌత్ ఇండియాను షేక్ చేసిన హాట్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా!

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిపోవడంతో.. సినీ సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గుతూ వచ్చింది...

క్యూట్ ఎక్స్‌ప్రెషన్లతో కవ్విస్తున్న ఈ చిన్నారి సౌత్ ఇండియాను షేక్ చేసిన హాట్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా!
Childhood Pic
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 16, 2021 | 4:46 PM

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిపోవడంతో.. సినీ సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గుతూ వచ్చింది. తమ సినిమా అప్‌డేట్స్‌ను హీరోహీరోయిన్లు తరచూ ఫ్యాన్స్‌తో సోషల్ మీడియా వేదికగా తరచూ పంచుకుంటారు. అలాగే అప్పుడప్పుడూ ఇన్‌స్టా లైవ్‌లలోకి వచ్చి వారితో ఇంటరాక్ట్ అవుతుంటారు. ఇదిలా ఉంటే.. హీరోయిన్ల ఫోటోలు ఫ్యాన్స్ ఎప్పుడూ పదిలంగా దాచుకుంటారు. అంతేకాకుండా వారు తమ సోషల్ మీడియా అకౌంట్లలో పెట్టడమే తడువు.. క్షణాల్లో వైరల్ చేసేస్తారు. మరోవైపు నెట్టింట ‘త్రోబ్యాక్’ ఫోటోల ట్రెండ్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ కోవకు చెందిన ఓ టాలీవుడ్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

జీన్స్‌ వేసుకుని క్రేజీ స్టైల్‌‌లో ఫోటోకు పోజిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడొక టాలీవుడ్ స్టార్ హీరోయిన్. మొదటి సినిమాతోనే తన అందచందాలతో కుర్రకారును కట్టిపడేసింది. ఆ తర్వాత సినిమాతో బాక్సాఫీస్ సూపర్ హిట్ అందుకుంది. తెలుగులో స్టార్ హీరోలందరితోనూ నటించింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తోంది. ఆమెవరో కాదు ఇలియానా.

‘దేవదాసు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఇలియానా.. ఆ తర్వాత ‘పోకిరి’, ‘జల్సా’, ‘కిక్’, ‘జులాయి’ లాంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల ‘ది బిగ్ బుల్’ సినిమాతో ఓటీటీలోకి అడుగుపెట్టిన ఇలియానా.. ‘తేరా క్యా హోగా లవ్లీ’ అనే మూవీతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది.

Also Read:

23 బంతుల్లో 106 పరుగులు.. 6గురి బౌలర్ల ఊచకోత.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన కోహ్లీ టీమ్‌మేట్.. ఎవరో తెలుసా!

ఈ ఫోటోలో చిరుత దాగుంది.. పజిల్ సాల్వ్ చేస్తే గ్రేటే.. ఫెయిల్ అవ్వడం ఖాయం!

మన కరెన్సీ నోట్లపై నల్లటి గీతలు మీరెప్పుడైనా చూశారా.? అవి ఎందుకో ఆలోచించారా.!